రాష్ట్రంలో లాక్డౌన్ ప్రకటన వెలువడిన అనంతరం మద్యం దుకాణాల వద్ద విపరీతమైన రద్దీ ఏర్పడింది. ఒక్కొక్క షాపు వద్ద వందలాది మంది గుమ్మికూడారు. తమ అవసరాలకు మించి మద్యాన్ని కొనుగోలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 10రోజుల లాక్ ప్రకటించబంతో మందుమాబులు పది రోజులకు సరిపడా మద్యాన్ని తీసుకువెళ్లేందుకు మద్యంషాపుల ముందు బారులు తీరారు. లాక్ డౌన్ ప్రకటన వెలుపడిన అనంతరమే మూడు గంటల వరకే రూ56 కోట్లు విలువైన మద్యం డిపోల నుంచి దుకాణాలకు సరఫరా అయ్యింది. ఆ తరువాత పెద్ద మొత్తంలో అమ్మకాలు జరగడంతో సుమారు రూ125 కోట్ల మద్యం అమ్ముడైంది.
మే నెలలో ఇప్పటి వరకు జరిగిన మద్యం అమ్మకాలు ఒక ఎత్తు అయితే..నిన్న ఒక్కరోజు జరిగిన మద్యం అమ్మకాలు ఒక ఎత్తు. మే నెల 10రోజులో రూ.676 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. అంటే రోజుకు సుమారు రూ.61 కోట్ల మేరకు అమ్మకాలు జరిగాయి. అయితే మంగళవారం ఒక్కరోజే రెట్టింపు అమ్మకాలు జరిగాయని దుకాణదారులు వెల్లడించారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రూ.24 కోట్లకు పైగా అమ్మకాలు జరగా.. వరుసగా నల్గొండలో రూ.15. 24 కోట్లు, ఖమ్మంలో రూ.12.25 కోట్లు, హైదరాబాద్లో రూ.10.17 కోట్ల విక్రయాలు జరిగాయి. రద్దీని బట్టి అదనంగా సరుకు తెప్పించుకున్నామని దుకాణదారులు తెలిపారు. డిపోల్లోనూ అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేసిన అబ్కారీ శాఖ… ఇండెంటు పెట్టిన వెంటనే మద్యం చేరవేసేలా చర్యలు తీసుకున్నారు.