మశూచిని పోలిఉండే వైరల్ వ్యాధి మంకీపాక్స్‌పై తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఎటువంటి లక్షణాలు కనిపించినా వెంటనే ప్రభుత్వానికి సమాచారం అందించి చికిత్స పొందాలని పేర్కొంది. ‘‘ప్రారంభంలో జ్వరం, తలనొప్పి, శరీరంపై వాపు.. వెన్ను, కండరాల్లో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. తర్వాత జ్వరం పెరిగి శరీరమంతా దద్దుర్లు వస్తాయి. అతికొద్ది మందిలోనే ఇది విషమంగా మారుతుంది. నోరు, ముక్కు, చర్మం నుంచి ఈ వైరస్ శరీరంలోకి చేరుతుంది. చేతిశుభ్రత పాటించడం, మాస్క్, ఫేస్‌షీల్డ్ వంటివి ధరించాలి’’ అని ప్రజలకు వైద్యారోగ్యశాఖ సూచించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement