మావోయిస్టు కీలక నేత సావిత్రి లొంగిపోయారని.. అమెలాగే.. మిగతా మావోయిస్టులు కూడా లొంగిపోవాలని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి కోరారు. సావిత్రి లొంగుబాటు సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మూడేండ్ల క్రితం తన భర్త మావోయిస్టు రామన్న చనిపోయినప్పుడు కనీసం తనకు సమాచారం ఇవ్వలేదని సావిత్రి తీవ్ర మనస్తాపానికి గురయ్యారన్నారు. మారిన పరిణామాలు, గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సావిత్రి జనజీవన స్రవంతిలో కలుస్తారని డీజీపీ తెలిపారు. సావిత్రి బాటలోనే మిగతా మావోయిస్టులు లొంగిపోవాలని మహేందర్ రెడ్డి కోరారు. సావిత్రిపై ఛత్తీస్గఢ్లో రూ. 10 లక్షల రివార్డు ఉందని పేర్కొన్నారు. తక్షణ సాయం కింద సావిత్రికి రూ. 50 వేలను మహేందర్ రెడ్డి అందించారు. సావిత్రి కుమారుడు రంజిత్ మావోయిస్టుగా పని చేసి ఏడాది క్రితం లొంగిపోయాడన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement