ఉమ్మడి మెదక్ బ్యూరో : అనాథలకు, అభాగ్యులకు, మానసిక రోగులకు అండగా నిలబడి సంపూర్ణ సహకారం అందిద్దామని మెదక్ కాంగ్రెస్ నేత నీలం మధు ముదిరాజ్ అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండల పరిధిలోని నాదర్ గుల్ గ్రామ పరిధిలో గట్టు గిరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాతృదేవోభవ ఆనాథశ్రమంలో మానసిక రోగికి పునర్జన్మ ఇచ్చి ఆశ్రయం కల్పించే కార్యక్రమంలో నీలం మధు పాల్గొన్నారు.
అంతకుముందు ఆశ్రమ ఆవరణలో ఉన్న శివుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ… మానసిక రుగ్మతలతో బాధపడుతున్న అభాగ్యులతో పాటు ఆనాథలకు అండగా నిలబడి చేరదీస్తున్న మాతృదేవోభవ అనాథాశ్రమ సేవలను ఆయన కొనియాడారు. నా వంతుగా వారికి సంపూర్ణ సహకారాలను అందిస్తానన్నారు. సామాజిక సేవలో పాల్గొంటున్న ప్రతిఒక్కరూ ఇలాంటి సంస్థలకు చేయుతానందించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆశ్రమంలో 135 మందికి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాపురం మల్లేష్, భరత్, శ్రీధర్, బాలు, ఆశ్రమం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచ ఉక్కు మహిళగా పేరుగాంచిన ధీశాలి స్వర్గీయ ఇందిరా గాంధీ..
ఉమ్మడి మెదక్ బ్యూరో : ప్రపంచ దేశాల్లో ఉక్కు మహిళగా మాత్రమే కాకుండా తన పాలన దక్షతతో పేరుగాంచిన వీరవనిత మాజీ ప్రధాని భారతరత్న ఇందిరాగాంధీ అని మెదక్ కాంగ్రెస్ నేత నీలం మధు ముదిరాజ్ అన్నారు. ఇందిరాగాంధీ జయంతి పురస్కరించుకొని చిట్కూల్ లోని ఎన్ఎంఆర్ క్యాంపు కార్యాలయాంలో పేదలకు ఆమె అందించిన సంక్షేమాన్ని స్మరించుకుంటూ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ… పేదలకు సంక్షేమం, అభివృద్ధిని దగ్గరికి చేసి భారతీయుల గుండెల్లో పదిలంగా నిలిచిపోయారని తెలిపారు. ఆనాడు ఆ మహానేత ముందు చూపుతో చేపట్టిన సంక్షేమ పథకాల ఫలితంగా దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. ఇందిరమ్మ పాలన స్ఫూర్తితో తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తూ అన్ని వర్గాలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని అందిస్తుందని స్పష్టం చేశారు.