మణుగూరు, మార్చి 7(ప్రభ న్యూస్): మాయదారి మావోయిస్టులను తరమి కోట్టి, మహిళలను కాపాడుకుందాం అంటూ మణుగూరు పట్టణ నడిబొడ్డున పోస్టర్లు కలకలం రేపాయి. ఈ పోస్టర్లు మణుగూరులో చర్చనీయాంశంగా మారింది. పేరుకే మావోయిస్టు సిద్దాంతాలని, దళంలో మహిళలకు రక్షణ లేదుంటూ పోస్టర్లలలో పేర్కొన్నారు. మావోయిస్టు దళంలో మహిళలపై లింగ వివక్షత చూపుతూ, అత్యాచారాలు జరుపుతూ మహిళలపై దాష్టీకంగా దాడులు జరుపుతూ, వంటపని బ్యాగులు మోపించడం అగ్ర నాయకులకు బానిసలుగా చేసి వ్యక్తిగత పనులు చేపిస్తున్నారన్నారు.
విద్యా, ఉద్యోగం, వ్యాపారాల అవకాశాలకు వాడుకొని, మహిళల ప్రగతి సాధిద్దాం, అంటూ మహిళా రిజర్వేషన్లు ఉపయోగించుకొని, పాలకులుగా మారదాం అంటూ పోస్టర్లలో తెలిపారు. ఈ పోస్టర్లు ప్రజాస్వామ్య ఆదివాసి సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటూ పోస్టర్లు వేశారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని, పోస్టర్లు వేయడంతో అసలు ఈ పోస్టర్లు ఎవరు వేశారు అంటూ, మండల వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి.