Tuesday, November 26, 2024

గంజాయిపై ఉక్కుపాదం మోపుదాం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలో గుడుంబా, గంజాయిలను సమర్ధవంతంగా నిర్ములించామని, అదేవిధంగా రాష్ట్రంలో డ్రగ్స్‌ నిర్మూలనకు ఉక్కుపాదం మోపాలని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఆబ్కారీ శాఖ అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖలలో ఉద్యోగులకు పదోన్నతులు కల్పించినట్లుగానే ఎక్సైజ్‌ శాఖను పటిష్ట పరిచేందుకు పదోన్నతులను వర్తింపజేశారని అన్నారు. అన్ని విభాగాలలో (ఎస్‌ ఐ అధికారి స్థాయి నుండి అదనపు కమిషనర్‌ స్థాయి అధికారుల వరకు) పదోన్నతులు, పోస్టుల అప్‌గ్రేడేషన్‌లతో పాటు పోస్టింగ్స్‌లకు ఆమోదం తెలిపారని ఆయన వెల్లడించారు. శనివారం ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తన క్యాంప్‌ కార్యాలయంలో ఉదయం ఉగాది పండుగ సందర్భంగా ఎక్సైజ్‌ శాఖ అధికారులకు పోస్టింగ్‌లతో కూడిన ఆర్డర్‌ పత్రాలను ఆబ్కారీ శాఖ డైరెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌తో కలసి అధికారికంగా అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలో గుడుంబా, గంజాయి లను సమర్ధవంతంగా నిర్ములించామన్నారు. అలాగే రాష్ట్రంలో డ్రగ్స్‌ నిర్ములనకు ఉక్కుపాదం మోపాలని ఆబ్కారీ శాఖ అధికారులను ఆదేశించారు. పదోన్నతులు సాధించిన అధికారులను మంత్రి అభినందించారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్రంలో ప్రొ#హబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ అధికారులు మరింత సమర్ధవంతంగా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని మంత్రి ఈ సందర్భంగా ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రొ#హబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారులు అజయ్‌ రావు, #హరికిషన్‌, అంజన్‌ రావు, డేవిడ్‌ రవికాంత్‌, శాస్త్రి, ఖురేషి, సురేష్‌ రాథోడ్‌, చంద్రయ్య గౌడ్‌, దత్తరాజు గౌడ్‌, సత్యనారాయణ, రవీందర్‌ రావు, గణేష్‌ గౌడ్‌, కిషన్‌ నాయక్‌, అరుణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement