Thursday, November 21, 2024

ఓరుగల్లును ట్రాఫిక్ ఫ్రీ సిటీ చేద్దాం.. ట్రాఫిక్ స్మూత్ గోయింగ్ కు ప్రయత్నాలు

వరంగల్ క్రైమ్, (ప్రభ న్యూస్) వరంగల్ మహానగరంలో గాడితప్పుతున్న ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకై పటిష్ట చర్యలు చేపట్టిన‌ట్టు పోలీసు అధికారులు ఇవ్వాల తెలిపారు. నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతూ, తల నొప్పిగా మారిన ట్రాఫిక్ నియంత్రణ కోసమై వరంగల్ అడిషనల్ డీసీపీ (ట్రాఫిక్) కె.పుష్ప రెడ్డి పక్కా, పకడ్బందీ చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. వరంగల్ నగరంలోని మూడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఎస్సైలకు ఏరియాలను కేటాయించారు. ఇక నుండి వారికి కేటాయించిన ప్రాంతాల్లోనే విధులు నిర్వర్తించాలి. అలాగే వారికి కేటాయించిన ఏరియాలో ఎటువంటి ట్రాఫిక్ ఇష్యూస్ తలెత్తకుండా చూసుకోవాల్సి ఉంది. అంతేగాక క్రమం తప్పకుండా తనిఖీలు చేపట్టాల్సి ఉంది. డ్రంకెన్‌డ్రైవ్‌ టెస్టులు, హెల్మెట్, నంబర్ ప్లేట్స్ , ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనలకు పాల్పడకుండా పక్కా చర్యలు తీసుకునే విడిజంగా కార్యాచరణ ప్రణాళికలు రచించుకోవాలి. రోడ్లపై పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా చూడటం, ఎక్కడ పడితే అడ్డదిడ్డంగా పార్కింగ్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. రెగ్యులర్ విజిట్స్ తో రోడ్లపై దుకాణాదారులు సైన్ బోర్డ్స్, కటావుట్స్, రోడ్లపైకి వచ్చి వస్తు, సామ‌గ్రి పెట్టకుండా పటిష్ట చర్యలు తీసుకొనే విధంగా అడిషనల్ డిసిపి పుష్ప రెడ్డి విధివిధానాలను సిద్ధం చేశారు.

పక్కాగా,పకడ్బందీగా అమలు చేసే విధంగా ఆయా ప్రాంత ఇన్స్ పెక్టర్లు ఓవరాల్ ఇన్స్ పేక్షన్స్ చేసే విధంగా పని విభజన చేశారు. ఈ మేరకు డిసిపి పుష్ప రెడ్డి ట్రాఫిక్ అధికారులతో సమావేశమై, ఎసైల వారిగా పని విభజన చేసి, ఏరియాలు కేటాయించారు. ఇప్పుడున్న ట్రాఫిక్ వ్యవస్థకు భిన్నమైన ఫలితాలు వచ్చి తీరాలని పుష్ప రెడ్డి ఆదేశించారు. ట్రాఫిక్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దే యజ్ఞంలో సక్సెస్ కావాలని ఎసై లకు అడిషనల్ డిసిపి పుషారెడ్డి మార్గ నిర్ధేశ్యం చేశారు. వరంగల్ కమిషనరేట్ పరిధి లోని వరంగల్, హన్మకొండ, కాజీపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు లలో ఉన్న ఎస్ఐ,ఆర్ఎస్ఐ లకు ఏరియా వైజ్ గా అధికారులను కేటాయించారు. ఇక నుండి వరంగల్ నగరంలో ట్రాఫిక్ సమస్యలే లేని నగరంగా తీర్చిదిద్దడంపై దృష్టిసారించాలని అడిషనల్ డిసిపి పుష్ప రెడ్డి సూచించారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ బాలస్వామి ఇన్స్పెక్టర్లు విజయ్ కుమార్, వడ్డే నరేష్ కుమార్,నోముల ప్రభాకర్ రెడ్డి, సతీష్ ట్రాఫిక్ ఎస్సైలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement