Wednesday, November 20, 2024

TS: మహాసముద్రం గండిని టూరిజం స్పాట్ గా తీర్చిదిద్దుతాం : మంత్రి పొన్నం

టూరింగ్ స్పాట్ గా మహాసముద్రం గండిని తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి దాదాపు 7 కిలోమీటర్ల దూరంలో ఉమ్మాపూర్ గ్రామ పరిధిలో గల అత్యంత ఆహ్లాదకరంగా ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఎత్తైన పర్వత ప్రాంతాలను, గుట్టల మధ్య ఉన్న మహాసముద్రాల గండి చెరువును జిల్లా కలెక్టర్ ఎం.మనుచౌదరితో కలిసి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పోన్నం ప్రభాకర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

ఎత్తైన గుట్టలను కలుపుతూ మధ్యలో ఉన్న చెరువును చూడటానికి చాలా మంది పర్యాటకులు వస్తారని స్థానిక ప్రజా ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకురాగా.. ఈ ప్రాంతాన్నంతటిని ఒక పెద్ద పర్యాటక క్షేత్రంగా చేయడం కోసం టూరిజం శాఖ వారితో సమావేశం నిర్వహించి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. ప్రకృతికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నాచురల్ గా కొండల నుండి వచ్చే జాలూ ద్వారా నిండే చెరువును చూడడానికి వచ్చే పర్యాటకులు వచ్చేందుకు రోడ్డు నిర్మాణం, అలాగే చెరువు నుండి నీరు వదిలే తుము మార్గం, చెరువు నిండిన తర్వాత బయటకు నీరు బయటకు వెళ్ళే మత్తడి ప్రాంతాలను పరిశీలించారు.

అక్కడి గ్రామస్తులతో బైలంపూర్ చెరువులో నీరు ఉంటే హుస్నాబాద్ లో భూగర్భ జలాలు పెరిగి నీరు పూల్ లేకపోతే నీళ్ళు అడగంటుతాయని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వానాకాలంలో మాత్రమే కనిపించే ఆరిద్ర పురుగును అపురూపంగా చేతుల్లో పెట్టుకుని చూసి మురిసిపోయారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట జిల్లా కలెక్టర్ మను చౌదరి, ఇతర అధికారులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement