Friday, November 22, 2024

TG: మఠంపల్లిని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపుతాం… మంత్రి ఉత్తమ్

మఠంపల్లి మండలాన్ని రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపేవిధంగా అభివృద్ధి చేస్తానని రాష్ట్ర ఇరిగేషన్, సివిల్ సప్లై మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం మఠంపల్లి మండలం బక్కమంతుల గూడెంలో రూ.2.5 కోట్లతో నిర్మించే 33/11 కె వి విద్యుత్ ఉప కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ… ఈ విద్యుత్ ఉపకేంద్రం కోసం ప్రజలు, రైతులు దశాబ్ద కాలంగా కోరుతున్నారని, ఇప్పుడు ఆ కోరిక నెరవేరిందన్నారు. సుల్తానపూర్ తండా వద్ద ఎన్ సీఎల్, చెన్నాయి పాలెం సబ్ స్టేషన్ల పనులు కూడా త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని, అలాగే ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తేవాలని అధికారులకు సూచించారు.

రూ.80కోట్లతో 10 మీటర్ల వెడల్పుతో హుజుర్ నగర్ నుండి మట్టపల్లి వరకు, రూ.10కోట్లతో చౌటపల్లి నుండి మేళ్లచెర్వు వరకు, రూ.17 కోట్లతో మట్టంపల్లి నుండి జానపహాడ్ రోడ్ మార్గంలో వర్ధపురం, రాఘవాపురం వద్ద రెండు బ్రిడ్జ్ లు, అలాగే రూ.11.5 కోట్లతో చెన్నాయి పాలెం వద్ద బ్రిడ్జి నిర్మించటం జరుగుతుందని, త్వరలో పనులు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు.

అమరవరం, పెద్దవీడు లిప్ట్ ఇరిగేషన్ లకి మరమ్మతులు పూర్తి చేసి అందుబాటులోకి తేవటం జరిగిందని, మరింత ఆయకట్టును పెంచటానికి ఏమైనా లిప్ట్ ఇరిగేషన్లు అవసరం ఉంటే మంజూరు చేస్తానని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. రైతుల కోసం 24 గంటల నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నామని, అలాగే గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోపు వాడుకున్న వారికి జీరో బిల్లు వస్తుందని, మహాలక్ష్మి పథకం కింద మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని, 500 రూపాయలకే గ్యాస్ అందిస్తున్నామని మంత్రి తెలిపారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, హుజూర్ నగర్ ఆర్డీఓ శ్రీనివాస్, జడ్పీ సీఈఓ వీవీ అప్పారావు, టీఎస్ ఎస్పీడీసీఎల్ ఎస్.ఈ. సీహెచ్ పాల్ రాజ్, డీఈ లు వెంకట కృష్ణయ్య, డాలి నాయుడు, ఈఈ. కృష్ణ రెడ్డి, తహసీల్దార్ మంగ, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement