Sunday, October 6, 2024

TG: ఆక్సిజన్ కోసం మొక్కలు పెంచుదాం : మంత్రి పొన్నం ప్రభాకర్

రామంతాపూర్, జులై 8(ప్రభ న్యూస్) : ఆక్సిజన్ కోసం మొక్కలు పెంచుదామని, గ్రేటర్ పరిధిలో 30లక్షల మొక్కలు నాటడమే లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఉప్పల్ నియోజకవర్గం రామంతపూర్ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన వనమహోత్సవం కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గజ్వల విజయ లక్ష్మి, జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి, స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొని మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కోటికి పైగా మొక్కలు నాటే వనమహోత్సవం కార్యక్రమం ఈరోజు నుండి ప్రారంభించామన్నారు. ఇప్పటికే 60లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రభుత్వం ప్రకృతిని కాపాడేందుకు బాధ్యతతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిందని, వాటిని కాపాడే బాధ్యత అక్కడ నివసించే స్థానికులదేనన్నారు.

ఈరోజు జీహెచ్ఎంసీ పరిధిలోని ముప్పై సర్కిల్లో, 56 ప్రాంతాల్లో ఏడు వేల మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుందన్నారు. గతంలో మాదిరి కాకుండా ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి మందుముల పరమేశ్వర్ రెడ్డి, కార్పొరేటర్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement