Saturday, November 23, 2024

టీడీపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహిద్దాం.. పార్టీ శ్రేణులకు బక్కని పిలుపు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ నెల 29న తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని , ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేయాలని టీటీడీపీ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది. ఈ మేరకు శనివారం ఎన్టీఆర్‌ భవన్‌లో టీడీపీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు మాట్లాడుతూ… ఇరు తెలుగు రాష్ట్రాల్లో 100 ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణలు చేయాలన్నారు. ఖమ్మం జిల్లా పాతర్లపాడులో త్వరలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని చెప్పారు. గ్రామ, గ్రామాన ఇంటింటిపై పార్టీ జెండాలు ఎగురవేస్తామన్నారు.

తెలంగాణలో పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, ప్రజా సమస్యలపై పోరాటం, ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేయాలన్నారు. పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్ట ర్స్‌ లో తెలుగు దేశం పార్టీని ఎన్టీఆర్‌ ప్రకటించి 40 సంవత్సరాలవుతోందని చెప్పారు. తెలంగాణలో నిజమైన స్వేచ్ఛా, స్వాతంత్య్రానికి ఎన్టీఆర్‌ పాలన మార్గం సుగమమం చేసిందన్నారు. పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ… టీడీపీలో చేరి 40 సంవత్సరాలు పూర్తవుతున్నందుకు గర్వంగా ఉందన్నారు. రాజకీయాల్లో హ్యూమనిజాన్ని ప్రవేశపెట్టిన ఘనత మాజీ సీఎం ఎన్టీఆర్‌దేనన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు చిలువేరు కాశీనాథ్‌, బంటు వెంకటేశ్వర్లు, నన్నూరి నర్సిరెడ్డి, ప్రేమ్‌ కుమార్‌ జైన్‌, తిరునగరి జ్యోత్స్న, మీడియా కార్యదర్శి ప్రకాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement