కాగా, కిచ కిచమంటూ శబ్దాలు చేస్తూ.. చిరు గింజలు, పురుగులను తిని జీవనం సాగించే ఊర పిచ్చుకులు ఇప్పుడు అంతగా కనిపించడం లేదు. పిచ్చుకలు (sparrow)అంతరించిపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. సెల్యూలర్ టవర్లు నుంచి వెలువడే అయస్కాంత తరంగాలు వాటికి పెను ముప్పుగా పరిణమించాయి. అయితే.. ఆ జాతిని కాపాడేందుకు కొన్ని చర్యలు తీసుకోవాలనే ఆరాటం ప్రకృతి ప్రేమికుల్లో కనిపిస్తోంది.
- Advertisement -
ఇక.. కృత్రిమమైన పిచ్చుక గూళ్లను ఏర్పాటు చేయడంతో ఆ జాతిని కొంతవరకు సంరక్షించవచ్చని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. గతంలో ఊర పిచ్చుకలు పల్లెటూర్లల్లో విరివిగా ఉండేవి, కానీ, టెక్నాలజీ డెవలప్‌మెంట్ కావడంతో.. సెల్ టవర్ల నుంచి వచ్చే విపరీతమైన రేడియేషన్ ప్రభావంతో అవి కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది.