Tuesday, November 26, 2024

NLG: బీజేపీ అభ్యర్థి వెంకటేశ్వరరావును గెలిపించండి.. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్

పెన్ పహాడ్ మండలం, నవంబర్ 18 (ప్రభ న్యూస్): బీజేపీ అభ్యర్థి వెంకటేశ్వరరావును గెలిపించాలని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కోరారు. శనివారం తెలంగాణ విగ్రహం చౌరస్తాలో రోడ్ షోలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ…రాష్ట్రాన్ని 65సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, 9 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వాలు పరిపాలనలో ఎన్నో వ్యాగ్దానాలు చేసి అమలు చేయక ప్రజలను మోసం చేశారన్నారు. జరగబోయే ఎన్నికల్లో అభివృద్ధి నిరోధకులు కావాలో ! అభివృద్ధి చేసేవారు కావాలో ! ప్రజలు ఆలోలించాలని కోరారు. రెండు పార్టీల పాలనలో ప్రజల జీవన విధానాల్లో అభివృద్ధిలో మార్పులు రాలేదన్నారు. ఎంతోమందికి ఈ నియోజకవర్గం నుంచి అవకాశం ఇచ్చారు.. కానీ ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు.

ఈ నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బీజేపీ పార్టీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావు గెలిపించాలని, ఆయన గెలిచిన వెంటనే ప్రధాని నరేంద్ర మోడీతో సంప్రదించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. అన్ని స్కామ్ముల్లో ఇరుక్కుపోయిన కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్నారు. అంతకు ముందు మండల కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. రోడ్ షోకు భారీగా తరలివచ్చిన కార్యకర్తల మధ్య మహిళా కోలాటాలతో కేంద్ర మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. గత తొమ్మిదేళ్ల పాలనలో రేషన్ కార్డు కూడా ఇవ్వని, ఉద్యోగ నోటిఫికేషన్ వేయని, వేసిన నోటిఫికేషన్ లీకేజీలతో రద్దు చేసిన, డబుల్ బెడ్రూములు అందించడం మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు.

రాబోయే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర నాయకులు సంకినేని వరుణ్ రావు, జిల్లా నాయకులు కపిల్ రెడ్డి, మన్మధ రెడ్డి, మండల అధ్యక్షులు పోకలరాములు, మండల ఇంచార్జ్ పోకల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి మధు, చేన్ను రమణారెడ్డి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు అరే ప్రభాకర్, నాయకులు తూముల సాయి, పిడమర్తి నాగయ్య, గూడపూరి శ్రీనివాస్, రంగినేని విజయ్ కుమార్, రాపర్తి వెంకన్న, రంగినేని మోహన్ రావు, ఒగ్గు రాములు, చిన్నపంగి నాగరాజు, ఒగ్గు వినోద్, సురుగు ప్రవీణ్, గుండపనేని నాగేశ్వరావు, ఒగ్గు శ్రీనివాస్, మచ్చ, కార్యకర్తలు, నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement