Tuesday, November 26, 2024

TS : మెద‌క్ జిల్లాలో చిరుత సంచారం

మెదక్ జిల్లా చేగుంట మండలంలోని ఇబ్రహీంపూర్ అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్నట్లు గుర్తించామని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నాగరాణి తెలిపారు. ఇబ్రహీంపూర్ అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్‌లో ఫారెస్ట్ నర్సరీలో చిరుత పులి సంచరిస్తున్నట్లు రికార్డు అయ్యిందని ప్రకటించారు.

- Advertisement -

చిరుత సంచారం వెలుగులోకి రావటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. భయాందోళనకు గురి కావొద్దన్నారు. ఇబ్రహీంపూర్ అడవిలో నుంచి ఆకు తీసుకురావటంతో పాటు వేరే అవసరాలున్నా ఎవ్వరూ వెళ్లొద్దని హెచ్చరించారు.

చిరుత పులి సంచరిస్తున్న కారణంగా ఇబ్రహీంపూర్ పరిధిలోని బోనాల గోవిందా పూర్, కిష్టాపూర్, పులిమామిడి, చిట్టోజ్ పల్లి, రుక్మాపూర్, రాంపూర్, కన్యారం గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అడవిలోకి ఎవరూ వెళ్లొద్దన్నారు. నర్సరీలోకి వచ్చిన చిరుత నీరు తాగి అక్కడే కొద్దిసేపు సేద తీరినట్టు అధికారులు గుర్తించారు. అక్కడ ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్స్ లో…. ఒక చుక్కల జింక కూడా వచ్చినట్లు రికార్డు అయింది. నీరు తాగి వెళ్లినట్లు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement