Kamareddy: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో చిరుత సంచారం భయాందోళనకు గురిచేస్తోంది. ప్రాజెక్టు పరిసరాలతో పాటు హాసన్పల్లి హెడ్ స్లూయిస్, నవోదయ విద్యాలయం ప్రాంతాల్లో చిరుత కనిపించింది. ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన పర్యాటకులు తిరిగి వెళ్తుండగా చిరుతను గమనించారు. దీంతో పర్యాటకులు కారు ఆపి, డోర్లు లాక్ చేసుకుని చిరుత కదలికలను సెల్ఫోన్లలో చిత్రీకరించారు.
ఈ ప్రాంతంలో చిరుత సంచారం కొత్తేమీ కాకున్నా.. గతంలో హాసన్పల్లి అటవీ ప్రాంతంలో గొర్రెలను చంపేసిన ఘటనలున్నాయి. పలు మార్లు ఫారెస్ట్ అధికారులు ఈ ప్రాంతంలో చిరుత ఫగ్ మార్క్స్ గుర్తించి.. చిరుత సంచారిస్తున్నట్లు గుర్తించారు. ప్రాజెక్ట్ పర్యాటకులకు చిరుత తారసపడడంతో ఇటు పర్యాటకులు అటు స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.