మహబూబ్ నగర్ జిల్లా కొయిలకొండ మండలం బూర్గుపల్లి గ్రామ శివారులో చిరుతను గ్రామస్తులు పట్టుకున్నారు. అయితే చిరుత రెండు కాళ్లకు గాయాలవడంతో కదలేని స్థితిలో ఉండిపోయింది. గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దాహంతో అలమటిస్తున్న చిరుతకు నీళ్లు పోసి తాగించారు. గత కొన్నిరోజులు హన్వాడ, కొయిలకొండ మండలాల పరిధిలో సంచరిస్తూ మూగజీవాలను చిరుత చంపినట్లు స్థానికులు చెబుతున్నారు. చిరుత సంచారంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గ్రామంలోని ఓ పశువుల కొట్టంలోని బర్రెలపై దాడికి ప్రయత్నించిందని, ఈ క్రమంలో అవి తొక్కడంతో గాయపడినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు గ్రామానికి చేరుకుని చిరుతను హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: కరోనా అంటకుండదంటే ఆటో ప్రయాణమే ది బెస్ట్..