Tuesday, October 29, 2024

MDK: తెలంగాణను బ్రష్టు పట్టించి… కోట్లు కొల్లగొట్టారు : మంత్రి సురేఖ

ఎంపీ అభ్యర్థి నీలం మధు ప్రచారం
ఘనస్వాగతం పలికిన పార్టీ శ్రేణులు
మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి, ఇన్చార్జి నర్సిరెడ్డిలతో కలిసి ఎంపీ అభ్యర్థి ప్రచారం..
తెలంగాణను బ్రష్టు పట్టించి… కోట్లు కొల్లగొట్టారు
కార్నర్ మీటింగ్ లో మంత్రివర్యులు కొండా సురేఖ
మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ఎన్నికల ప్రచారం సోమవారం గజ్వేల్ నియోజకవర్గం కొండపాకలో కోలాహాలంగా మొదలైంది. రాష్ట్ర అటవీ, పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి, పార్లమెంట్ ఇంచార్జి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఎంపీ అభ్యర్థి నీలం మధు, మాజీ ఎమ్మెల్యే ఇన్చార్జి నర్సిరెడ్డి, మెదక్ డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్, మాజీ పౌసింగ్ కార్పోరేషన్ భూoరెడ్డి తదితరులకు కాంగ్రెస్ పార్టీ నేతలు, నాయకులు ఘన స్వాగతం పలికి, వారిని సత్కరించారు, అనంతరం కొండపాక సెంటర్ వరకు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ ఎంపీ అభ్యర్థి నీలం మధుతో కలిసి ప్రచార రథంలో అభివాదం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి, కొండపాక మాజీ సర్పంచ్ చిట్టి మాధురి రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు వాసవి లింగరావు, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంక్ష, లీలావతి, మల్లిఖార్జున్, హరీఫ్, వెంకట్, ఆనంతుల నరేందర్, చిన్న శ్రీనివాస్, మహదేవ్, చిరంజీవి , ఎరుపుల మల్లెశం, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణను బ్రష్టు పట్టించి… కోట్లు కొల్లగొట్టారు : మంత్రి సురేఖ
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించి, కోట్ల రూపాయలు కొల్లగొట్టాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి, మెదక్ పార్లమెంటు ఇన్చార్జి కొండా సురేఖ అన్నారు. ఎంపీ అభ్యర్థి నీలం మధు ఎన్నికల ప్రచారంలో భాగంగా గజ్వేల్ నియోజకవర్గం కొండపాకలో కార్నర్ మీటింగ్ లో మంత్రి కొండా సురేఖ మాట్లాడారు. కెసిఆర్ కాలేశ్వరం, మేడిగడ్డ, సుందిళ్ల వంటి ప్రాజెక్టులలో కోట్ల రూపాయల పర్సెంటేజీలు తీసుకుని, వారి అవసరాల నిమిత్తమే పనులు చేశారని విమర్శించారు. మాజీ సీఎం కెసిఆర్ బయట పనులు వ్యవహారం చక్క దిద్దితే, ఆయన కుమారుడు కేటీఆర్ షాడో సీఎంగా పనిచేశారని పేర్కొన్నారు. ఆయా పనుల ప్రస్తావనకు సంబంధించి వారిని ప్రశ్నిస్తే తప్పించుకునే వారన్నారు. మంచి జరిగితే ఇది మావల్లే సాధ్యమైందని, చెడు జరిగితే ఎదుటి వాళ్ల మీదకు నెట్టేలా రాజకీయం చేశారని విమర్శించారు. ప్రచారంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ నియోజకవర్గానికి విచ్చేసిన తనకు ఈ ప్రాంతాన్ని కెసిఆర్ ఏం అభివృద్ధి చేశాడో? కనిపించలేదన్నారు. కనీసం రోడ్లు కూడా సరిగా వేయించ‌ని కెసిఆర్ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా పాలించాడో ? ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. కాలేశ్వరం చూస్తే కృంగిపోయింది, మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీ అయింది, వాటిని చూసేందుకు వెళితే మాజీ సీఎం కేసీఆర్ అవహేళనగా మాట్లాడుతున్నారన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టును కరెక్టుగా డిజైన్ చేసి ఉంటే తెలంగాణ ప్రజలంతా సంతోషించే వారిని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి జరిగిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆమె కోరారు. మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న నీలం మధును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు.

వల్లకాడు చేసిండు.. మైనంపల్లి హనుమంతరావు

మెదక్ ను మాజీ మంత్రి హరీష్ రావు వల్లకాడు చేశాడని మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొండపాక కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు హరీష్ రావు కేవలం ఫోటోలకు ఫోజులిచ్చి, హైదరాబాదులో తేలేవాడని పేర్కొన్నారు. బిఆర్ఎస్ పాలనలో మార్కెట్ కమిటీలను కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. 10ఏళ్లు ఇక్కడ నాయకుల మధ్య పంచాయతీలు పెట్టించడానికే హరీష్ రావుకు సరిపోయిందని దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన నీలం మధును గెలిపించి, బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ తోనే మేలు.. నీలం మధు
లోక్ స‌భ‌ ఎన్నికల్లో తనను గెలిపించి, ప్రజాసేవ చేసుకునే అవకాశం ఇవ్వాలని ఎంపీ అభ్యర్థి నీలం మధు ఓటర్లను అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారాలలో భాగంగా కొండపాక కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు భూములు, ఇండ్లు కేటాయించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనిని తెలిపారు. ఈ దేశంలో రానున్నది కూడా ఇండియా కూటమిదే అధికారమని స్పష్టం చేశారు. తనను ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement