సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ .బెస్ట్ టూరిజం స్పాట్‌గా పాలమూరును తీర్చిదిద్దుతామని అన్నారు. జిల్లా కేంద్రంలోని ట్యాంక్ బండ్ వద్ద 12 కోట్ల రూపాయలతో చేపట్టిన సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పట్టణాలు పేరుకే ఉండేవి. కనీసం తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితి ఉండేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పల్లెల, పట్టణాలు గణనీయమైన వృద్ధిని సాధిస్తున్నాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ట్యాంక్ బండ్‌ను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి పేర్కొన్నారు. ఐ ల్యాండ్, సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణం, వాకింగ్ ట్రాక్ చేపడుతున్నాం. మురికి కూపంగా ఉన్న చెరువును సుందరంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి వివరించారు. చుట్టూ పక్కల పది జిల్లాల ప్రజలు వచ్చేలా అభివృద్ధి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మహబూబ్నగక్కి రెండు వైపులా 8 వందల ఎకరాల్లో పారిశ్రామిక వాడ, ఐటీ కంపెనీల కోసం ఏర్పాటు చేస్తున్నామన్నారు.
బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన- బెస్ట్ టూరిజం స్పాట్ గా పాలమూరు-మంత్రి శ్రీనివాస్ గౌడ్
Advertisement
తాజా వార్తలు
Advertisement