Thursday, September 12, 2024

Sixth Campus … కాగ్నిజెంట్ విస్తరణకు ముహుర్తం ఫిక్స్

సీఎం రేవంత్ చేతుల మీదుగా రేపు విస్త‌ర‌ణ‌కు శ్రీకారం
హాజ‌రుకానున్న కాగ్నిజెంట్ సీఈవో ర‌వికుమార్
క్యాంప‌స్ విస్త‌ర‌ణ‌తో మ‌రో 15 వేల‌ మందికి ఉద్యోగాలు
ఇప్ప‌టికే హైద‌రాబాద్‌లో ఆయిదు క్యాంప‌స్‌లు
57 వేల మందికి ద‌క్కిన‌ ఉద్యోగ అవ‌కాశం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్, హైద‌రాబాద్ : ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ – ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్‌ హైదరాబాద్ లో తమ కొత్త క్యాంపస్ ను రేపు శంకుస్థాపన చేయనుంది. అమెరికా, దక్షిణ కొరియా పర్యటన ముగించుకొని రేపు హైద‌రాబాద్ రానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కంపెనీ విస్త‌ర‌ణ‌కు శ్రీకారం చుట్టున్నారు. కాగ్నిజెంట్‌ సీఈవో రవికుమార్‌ కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌నున్నారు..

- Advertisement -

ఇది ఇలా ఉంటే రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అమెరికా పర్యటనలో భాగంగా కాగ్నిజెంట్ కంపెనీ సీఈవో రవికుమార్ తో చర్చలు జరిపారు. న్యూజెర్సీలో ఈనెల 5వ తేదీన రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందానికి అనుగుణంగా కాగ్నిజెంట్ కంపెనీ పది రోజుల్లోనే కొత్త క్యాంపస్ విస్తరణకు శ్రీకారం చుట్టింది. ఒప్పందంలో భాగంగా తమ కంపెనీ విస్తరణ ప్రణాళికలను ముందుగానే వెల్లడించింది. హైదరాబాద్ లో 10 లక్షల చదనపు అడుగుల కొత్త క్యాంపస్ నెలకొల్పుతామని, అదనంగా 15 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని ప్రకటించింది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, డిజిటల్‌ ఇంజనీరింగ్‌, క్లౌడ్‌ సొల్యూషన్స్‌తో సహా వివిధ అధునాతన సాంకేతికతలపై కొత్త క్యాంపస్ ఫోకస్​ చేస్తుంది.

ఒప్పందంలో భాగంగా తమ కంపెనీ విస్తరణ ప్రణాళికలను ముందుగానే వెల్లడించింది. హైదరాబాద్ లో 10 లక్షల చదనపు అడుగుల కొత్త క్యాంపస్ నెలకొల్పుతామని, అదనంగా 15 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని ప్రకటించింది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, డిజిటల్‌ ఇంజనీరింగ్‌, క్లౌడ్‌ సొల్యూషన్స్‌తో సహా వివిధ అధునాతన సాంకేతికతలపై కొత్త క్యాంపస్ ఫోకస్​ చేస్తుంది.

ఇది ఇలా ఉంటే 1994లో చెన్నై కేంద్రంగా ఆవిర్భవించిన కాగ్నిజెంట్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. హైదరాబాద్‌లో 2002 నుంచి కార్యకలాపాలు ప్రారంభించింది. ఐటీ కారిడార్‌లోని వివిధ ప్రాంతాల్లో ఐదు క్యాంపస్​లు ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో దాదాపు 57 వేల మంది ఉద్యోగులున్నారు. రాష్ట్రంలో ఐటీ రంగంలో అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న రెండో సంస్థగా కాగ్నిజెంట్‌కు పేరుంది. గడిచిన రెండేండ్లలో ఈ కంపెనీ రాష్ట్రంలోని 34 వివిధ విద్యాసంస్థల నుంచి 7500 మంది ప్రెషర్లకు ఉద్యోగాలు ఇచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో కాగ్నిజెంట్ కంపనీ తెలంగాణ నుంచి రూ. 7725 కోట్ల ఐటీ ఎగుమతులను నమోదు చేసింది. గడిచిన అయిదేండ్లలో కార్పొరేట్ సోషల్ రెస్సాన్సిబులిటీ కింద ఈ కంపెనీ రూ. 22.5 కోట్లతో వివిధ సామాజిక కార్యక్రమాలు చేపట్టింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement