నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నింబాచల క్షేత్రంపై శ్రీ లక్ష్మీనరసింహుని బ్రహ్మౌత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా మొదటి రోజున భీమ్ గల్ పట్టణంలోని గ్రామాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహుని ఉత్సవ విగ్రహలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు పురాతన గ్రామాలయంలో లక్ష్మీ నరసింహుని ఉత్సవ విగ్రహలకు ప్రత్యేక పూజల ఆనంతరం స్వర్ణాలంకరణ గావించారు. రంగురంగుల పూలతో స్వామివారి పల్లకిని అలంకరిం చారు. పల్లకిలో శ్రీ లక్ష్మీ నరసింహుడు సతీ సమేతంగా కొలువుకాగ, పల్లకిని బోయలు వెూస్తుండగా గోవింద నామస్మరణతో స్వామివారి యాత్ర కొండ వరకు కొనసాగింది. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement