Sunday, November 24, 2024

TS | జూన్‌ 3న లా సెట్‌, పీజీఎల్‌ సెట్‌ పరీక్షలు…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : తెలంగాణలో లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ 2024 పరీక్షలను జూన్‌ 3న నిర్వహిస్తున్నట్లు సెట్‌ కన్వీనర్‌ విజయలక్ష్మి తెలిపారు. రూ.2,000 ఆలస్య రుసుంతో మే 20వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు తమ దరఖాస్తుల్లో ఏవైనా తప్పులు దొర్లితే మే 20 నుంచి 25వ తేదీ వరకు సరిచేసుకోవడానికి ఎడిట్‌ ఆప్షన్‌ అందుబాటులో ఉంచనున్నట్లు- వెల్లడించారు. జూన్‌ 3వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు కన్వీనర్‌ తెలిపారు.

లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ 2024 పరీక్షల షెడ్యూల్‌..

మూడేళ్ల లా డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే లాసెట్‌ పరీక్ష ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ లా డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు టీఎస్‌ పీజీఎల్‌సెట్‌ 2024 పరీక్ష నిర్వహిస్తారు.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ అడ్మిట్‌ కార్డులు విడుదల.. ఈ నెల 26న పరీక్ష

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2024 పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2024 పరీక్ష మే 26వ తేదీన నిర్వహించనున్నారు. ఉదయం సెషన్‌లో పేపర్‌-1 పరీక్ష, మధ్యాహ్నం సెషన్‌లో పేపర్‌-2 పరీక్ష.. ఇలా మొత్తం రెండు సెషన్లలో పరీక్ష జరగనుంది. ఈ పరీక్షలో ర్యాంకులు పొందిన వారికి దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీ-లు, ఇతర ప్రఖ్యాత సంస్థల్లో నిర్వహించే కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు లభిస్తాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement