ఎన్నికల నిబంధనల ప్రకారం భైంసా 144 సెక్షన్ అమలులో ఉండగా 50 మంది గుమిగూడి ఉన్నారన్న సమాచారంతో ఎఫ్ ఎస్ టి టీమ్ తో సోదాలకు వచ్చినట్లు ఏఎస్పీ సుభాష్ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. వారికి సపోర్టుగా వచ్చిన పోలీసులకు కార్యకర్తలకు వాగ్వాదం తలెత్తిందని కార్యకర్తలు పోలీసులను కొట్టారని అన్నారు. ప్రతి ఒక్కరిపై కేసు నమోదు చేస్తామని ఏఎస్పీ తెలిపారు.
ఘర్షణ వాతావరణం తలెత్తడంతో పలువురు కార్యకర్తలకు, పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయని, పలు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయని తెలిపారు. ఇదిలా ఉండగా ఇంట్లో మగవారు ఎవరూ లేని సమయంలో అర్ధరాత్రి వేళ పోలీసులు గేట్లు, గోడలు దూకి ఇంట్లోకి వచ్చారని ఇంట్లో మగవారు లేనపుడు దౌర్జన్యానికి దిగడం ఎంతవరకు సమంజసమని కుటుంబీకులు పేర్కొన్నారు. ఏదైనా ఉంటే లీగల్ గా రావాలని ఇలా దొంగచాటున రావడమెంటని ప్రశ్నించారు. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.