బహిరంగసభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు, ఆత్మీయ సమ్మేళనాలు, సమావేశాలు, ర్యాలీలు, పాదయాత్రలతో హోరెత్తిన తెలంగాణ రాష్ట్రం ఇవాళ్టితో మూగబోనుంది. సాయంత్రం 5 గంటల నుంచి 144 సెక్షన్ అమలు కానుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి ఈరోజుతో ఎండ్ కార్డ్ పడనుంది. నేటి సాయంత్రం నుంచి సోషల్ మీడియాలోనూ ప్రకటనలకు అనుమతి లేదు. పోలింగ్‌కు 48 గంటల ముందే తెలంగాణ రాష్ట్రమంతటా 144 సెక్షన్ అమల్లోకి వస్తుందని, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు.. సమావేశాలు, ఇంటింటి ప్రచారం లాంటివి చేయవద్దని ఈసీ సూచనలు చేశారు. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేది సాయంత్రం 5 గంటల వరకు సైలెంట్ పీరియడ్‌లో టీవీ, సోషల్ మీడియాలో ప్రకటనలకు అనుమతి లేదు.