Tuesday, November 19, 2024

Last Rites – ముగిసిన రాజీవ్ ర‌త‌న్ అంత్య‌క్రియ‌లు

ఘనంగా నివాళుల‌ర్పించిన సిఎం రేవంత్
అధికార లాంచనాల‌తో జూబ్లీ హిల్స్ మ‌హా ప్ర‌స్థానంలో
బౌతిక కాయానికి అంత్య‌క్రియ‌లు

హైద‌రాబాద్ – గుండెపోటుతో హఠాన్మరణం పొందిన సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ బౌతిక‌కాయానికి అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను నేడు నిర్వహించారు. అంతిమ సంస్కారాలకు సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు హాజరై నివాళులు అర్పించారు. రాజీవ్ రతన్ కుటుంబసభ్యులను ముఖ్యమంత్రి ఓదార్చారు.

గుండెపోటుతో క‌న్నుమూత

రాజీవ్ రతన్‌ గుండెపోటుతో మంగళవారం కన్నుమూశారు. రాజీవ్ రతన్‌ ప్రస్తుతం విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా కొన సాగుతున్నారు. ఉదయం ఛాతినొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఏఐజీ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. 1991 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన రాజీవ్ రతన్ సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఇటీవల మేడిగడ్డ ప్రాజెక్టుపై ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్​మెంట్​ విచారణకు ఆయనే సారధ్యం వహించారు. గతంలో ఆయన కరీంనగర్ ఎస్పీగా, పైర్ సర్వీసెస్ డీజీగా పని చేశారు. హైదరాబాద్ రీజియన్ ఐజీగా, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీగా వివిధ హోదాల్లో పని చేశారు. ఆయన ఆకస్మిక మరణం పోలీస్‌ శాఖను దిగ్భ్రాంతికి గురి చేసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement