Tuesday, July 2, 2024

Last Rites – అశేష జనవాహిని మధ్య రమేష్ రాథోడ్​ అంతిమ వీడ్కోలు


ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్: బీజేపీ నేత, మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ (58) అంతిమయాత్ర ఆశ్రు నయనాల మధ్య ఉట్నూరులో కొనసాగింది. రాథోడ్ రమేష్ శనివారం తీవ్ర అస్వస్థతకు లోనై చనిపోయారు. కాగా, రాజకీయ పార్టీలకు అతీతంగా వేలాదిమంది ఉట్నూరుకు తరలివచ్చి భౌతిక కాయం వద్ద నివాళులర్పించారు. ఆయన అభిమానులు గిరిజనులు వేల సంఖ్యలో బారులు తీరి తమ నేతను కడసారిగా సందర్శించి కన్నీటి పర్యంతమయ్యారు. 30 ఏళ్ల రాజకీయ సుదీర్ఘ జీవితంలో రమేష్ రాథోడ్ ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులు, గిరిజనేతరుల ఆత్మబంధువుగా పేరు గడించారు. ఎమ్మెల్యేగా, జడ్పీ చైర్మన్ గా, ఎంపీగా అనేక పదవులు అలరించి జిల్లాకు వన్నెతెచ్చిన మహానేత రాథోడ్ ఇక లేరన్న వార్తతో గిరి పల్లెల్లో విషాదఛాయలు అమ్ముకున్నాయి. ఐదు కిలోమీటర్ల పొడవునా సాగిన అంతిమయాత్రలో వివిధ ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో జనంపల్లి వచ్చి ఘన నివాళులర్పించారు.

బీజేపీకి తీరని లోటు: బండి సంజయ్

పేద గిరిజనుల పెన్నిధిగా రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని అనేక పదవులు అలరించి అకాల మరణం పొందిన రమేష్ రాథోడ్ మృతి బిజెపికి తీరనిలోటని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. తనతో రాథోడ్ కు ఉన్న అనుబంధాన్ని బండి సంజయ్ గుర్తు చేసుకున్నారు. పార్టీ ఒక పెద్దదిక్కుని కోల్పోయిందని, గిరిజనుల కోసం మారుమూలపల్లెల అభివృద్ధికి రాథోడ్ చేసిన సేవలను కొని యాడారు.

- Advertisement -

అంతిమ‌యాత్ర‌లో ప‌లువురు నేత‌లు..

అంతిమయాత్రలో ఎంపీ లు గోడం నగేష్, ఈటెల రాజేందర్, ఎమ్మెల్యేలు వెఢమ బొజ్జు, అనిల్ జాదవ్, పాయల్ శంకర్, జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, మాజీ ఎంపీ సోయం బాపూరావ్, మాజీ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్న, అమర్ సింగ్ తిలావత్ , మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్ పార్టీల నేతలు పాల్గొన్నారు. రమేష్ రాథోడ్ భౌతికకాయంపై బిజెపి జెండాను కప్పి పార్టీ నాయకులు నివాళులర్పించారు. అంతిమయాత్రలో రాథోడ్ రమేష్ అమర్ రహే నినాదాలు మిన్నంటాయి. ఆయన పెద్ద కొడుకు రితేష్ రాథోడ్ చితికి నిప్పంటించి విలపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement