చెన్నూర్ ఆగష్టు 8(ప్రభన్యుస్) ఎస్సీ వర్గీరణకు బిల్లు ప్రవేశ పెట్టేందుకు అన్ని పార్టీలు ఎన్నికలకు ముందు మోసపూరిత వాగ్దానాలు చేసి కాలాన్ని వెళ్లదీస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణమాదిగ ఆవేదన వ్యక్తంచేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని ఎం ఆర్ఆర్ గార్డెన్ లో నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. తొలుత స్థానిక కొత్త బస్టాండ్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు స్థానిక ఎమ్మార్పీఎస్ నాయుకుల అధ్వర్యంలో స్వాగత ర్యాలీ నిర్వహించారు.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 30ఏళ్లుగా ఎస్సీ వర్గీకణకై పోరాడుతూనే ఉన్నామని అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సమయాల్లో మాదిగలను ఓట్లు వేయించేందుకు వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చి తప్పుతున్నారని , కేవలం రాజకీయాలకు పావులుగా వాడుకుంటున్నారని అన్నారు.
హైదరబాద్ లో జరిగే మాదిగల విశ్వరూప మహాసభ ను విజయ వంతం చేయాలని , ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత సాధించేందుకు అంతిమ యుద్దానికి మాదిగ ఉప కులాలు సిద్దం కావాలన్నారు. సుమారు 30లక్షల మందితో నిర్వహించే సభకు మాదిగ ఉప కులాలు ప్రతి ఇంటికి తాళం వేసి హైదరాబాద్ నగరానికి చేరుకోవాలని మంద కృష్ణ పిలుపునిచ్చారు. కేంద్ర బిజెపి పార్టీ ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాటలు కార్యరూపం దాల్చలేదని ఈ వర్షా కాలం పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశం లో కాంగ్రెస్ నాయకులు దాసరపు శ్రీనివాస్, రామిళ్ళ రాధిక ఎమ్మార్పీఎస్ ఎమ్మెస్పి అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు విద్యార్థులు పాల్గొన్నారు