హైదరాబాద్, ఆంధ్రప్రభ : వచ్చే అసెంబ్లి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఆ పార్టీ నేతలు పోటీ పడుతున్నారు. టికెట్ల కోసం వంద లాదిగా దరఖాస్తులు చేసుకుంటున్నా రు. ఈ నెల 18 నుంచి మొదలైన దర ఖాస్తులు పర్వం నేటితో ముగు స్తుంది. దీంతో గాంధీ భవన్ ఆశావాహులతో కిటకిటలాడుతున్నది. ఇక గురువారం వరకు ఎన్నికల్లో పోటీ చేసే అశావాహుల నుంచి 700లకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇక ఒక రోజే మిగిలి ఉండటంతో మరో వంద వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. టికెట్ కోసం పోటీ పడే ప్రతి వ్యక్తి తన అనుచరులతో గాంధీ భవవన్కు వచ్చి కోలాహలం చేస్తున్నారు. కాగా, గురువారం ఒక్క రోజే పార్టీ టికెట్ కోసం దాదాపు 200 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కోడంగల్ నియోజక వర్గం నుంచి ఆయన అనుచరులు దరఖాస్తును అంద జేశారు. పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య జనగామ నుంచి, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ కామారెడ్డి కోసం, మాజీ మంత్రి జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డి నాగార్జున సాగర్, మరో తనయుడు మిర్యాలగూడ టికెట్ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ముషిరాబాద్‌కు పార్టీ సీనియర్ నేత సంగిశెట్టి జగదీశ్వర్‌రావు, హుస్నాబాద్ కోసం మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఖానాపూర్ నియోజక వర్గం టికెట్ కోసం ఆ పార్టీ మహిళా నాయకురాలు చారులత రాథోడ్, మునుగోడు కోసం పున్నా కైలాష్ నేత, ఎల్బీనగర్ టికెట్ కోసం మల్రెడ్డి రంగారెడ్డి రంగారెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. కాగా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితర సీనియర్లు శుక్రవారం దరఖాస్తులు అందజేయనున్నారు.