హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఈ 2023-24 విద్యాసంవత్సరానికి ఇంకా ఇంతవరకూ ఇంటర్ ఫస్ట్ ఇయర్‌కు సంబంధించి ఏ కాలేజీలోనూ అడ్మిషన్ పొందలేదా?.. అయితే అలాంటి వారికి ఇంటర్ బోర్డు చివరి అవకాశం కల్పిస్తోంది. ఫేజ్2 అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా ఈనెల 10వ తేదీ వరకు రూ.2వేలు ఆలస్య రుసుమును చెల్లించి రాష్ట్రంలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో విద్యార్థులు అడ్మిషన్లు పొందేందుకు బోర్డు అధికారులు అవకాశం కల్పించారు.
ప్రభుత్వ కళాశాలల్లో చేరదల్చుకునే విద్యార్థులు మాత్రం ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇప్పటికే పలుమార్లు ప్రవేశాలకు సంబంధించిన గడువును పొడిగిస్తూ వచ్చిన బోర్డు ఈ అవకాశాన్ని చివరి అవకాశంగా పేర్కొంది. దీన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.