Tuesday, November 26, 2024

జులై 17, 18 తేదీల్లో లష్కర్‌ ఉజ్జయిని మహంకాళి జాతర..

తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత వైభవంగా నిర్వహించే లష్కర్‌ బోనాల ఉత్సవాలు రానే వస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు పేద్ద ఎత్తున్న నిధులు కూడ మంజూరు చేస్తున్నాది. ఆషాడ మాసంలో వచ్చే ఈ జాతర కోసం యవత్‌ తెలంగాణ ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తుంటారు. చిన్నపేద్ద అందరికి ఇష్టమైన పండుగ బోనాల పండుగ. కొవిడ్‌ నిబంధనాలు పాటిస్తూ జాతరను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో నగర ప్రజలలో ఉత్సవాం నేలకొంది. సికింద్రాబాద్‌లోని చారిత్రాత్మకమైన ఉజ్జయిని మహంకాళీ జాతర జులై 17, 18 తేదీల్లో జరుగనున్నది. దీనికి 2వారాల ముందు ఘటాల ఊరేగింపు ప్రారంభం కానుండడంతో లష్కర్‌లో పండుగ వాతావరణం కనిపిస్తున్నది. ఈ జాతరకు దాదాపు 20 లక్షల మందికిపైగా భక్తులు రానున్న దృష్ట్యా అందుకు తగ్గా ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. 205 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ దేవాలయానికి రాష్ట్రం నుండే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి వేలాది భక్తులు తరలిరానున్నారు.

జూలై 17వ తేది ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ బోనాలు. తెల్లవారుజామున 4 గంటలకు వేదమంత్రోచ్చారణలతో ఆలయ ద్వారం తెరవడం జరుగుతుంది. అదేరోజు తెల్లవారుజాము నుండే నగర మూల ల నుండే కాకుండా రాష్ట్ర నలు మూలల నుండి లక్షలాది మంది తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. సాయంత్రం 5గంట ల నుండి సోమవారం తెల్లవారుుజా మున 5గంటల వరకు వివిధ ప్రాంతా ల నుండి వచ్చే ఫలహరబండ్లు దేవా లయం చుట్టు తిరిగి పోతరాజు లు ఆలయం లోపలోకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుంటారు.

18వ తేదిన తెల్లవారు జామున 5నుండి ఉదయం 7వరకు ఆలయం శుభ్రపరుచు ట. ఎనిమిదిన్నరకు రంగం కార్య క్రమం ఉంటుంది. రాష్ట్రంలో జరిగే భవిష్యవాణిని వివరించ డం జరుగుతుంది. ఉదయం 11గంటలకు శ్రీ అమ్మవారి చిత్రపటము ఏనుగు పై అమర్చి ప్రత్యేక అలంకరణ చేసి బ్యాండ్‌, బాజా వాయిద్యాలతో అనేక మంది భక్తులు, స్వచ్చంద సంస్థలతో, పుర ప్రముఖులతో ఆలయం చుట్టు ప్రదర్శన చేసి తదుపరిఅమ్మవారి గజాధిరోహణమై పురవీధుల గుండా మెట్టుగూడ ప్రాంతానికి ఘటంతో సహా వెళ్తుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement