Thursday, November 21, 2024

TG | ఏసీబీకి చిక్కిన ల్యాండ్ సర్వే అధికారిణి..

మహబూబాబాద్, (ఆంధ్రప్రభ) : జిల్లా సమీకృత కలెక్టరేట్‌లోని సర్వే ల్యాండ్‌ రికార్డు కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సీనియర్ డ్రాఫ్ట్స్ మెన్ జ్యోతి శర్మ బాయి రూ.20 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకున్నారు.

వరంగల్ కు చెందిన కార్తీక్ అనే వ్యక్తి మానుకోటలో భూమి కొనుగోలు చేసి టి పన్ కోసం దరఖాస్తు చేసుకోగా, డ్రాఫ్ట్ మెన్ ఖర్చుల కోసం ముందుగా రూ.5 వేలు తీసుకుని ఇంకా రూ.20 వేలు లంచం ఇస్తేనే సర్వే రికార్డులు ఇస్తానని చెప్పి బాధితుడిని ఇబ్బంది పెట్ట‌డంతో… అత‌ను ఏసీబీ అధికారులను ఆశ్రయించిన‌ట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు.

సర్వే అధికారిణి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. జ్యోతిని శుక్రవారం ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామన్నారు. రాత్రి పొద్దు పోయే వరకు ఏసీబీ అధికారులు సర్వే రికార్డులు పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement