తెలంగాణలో భూముల విలువ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు ఏడు సంవత్సరాల తరువాత తొలిసారి భూముల విలువను ప్రభుత్వం సవరించింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత ఇప్పటివరకు భూముల విలువ పెంపు, సవరణ జరుగలేదు. రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా యథావిధిగా ఉన్నాయి. కానీ బహిరంగమార్కెట్‌లో భూముల విలువలు బాగా పెరిగాయి. ఓ భూమికి ప్రభుత్వం నిర్ణయించి విలువకు బహిరంగ మార్కెట్ విలువకు పొంతన లేకుండా పోయింది. వేలల్లో మార్కెట్ విలువ ఉంటే లక్షలో డిమాండ్ ఉంటోంది..దీంతో వీటన్నింటినీ పరిశీలించిన ప్రభుత్వం ఈసారి కొంతమేరకు భూముల విలువను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక ప్రస్థుతం రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో పడింది.. దీంతో భూములను అమ్మకం బాట పట్టింది ప్రభుత్వం..అయితే భూముల ధరలు సవరించాక అమ్మితే ప్రభుత్వానికి అదనపు ఖాజానా వచ్చి చేరుతుందన్న ఉపాయంతో కూడా భూముల విలువ పెంచినట్లు తెలుస్తోంది. ఇక ప్రజలపై భారం పడకుండా పట్టణాలు, నగరాలవారీగా భూముల విలువ పెరిగినట్లుగా సమాచారం. పెంచిన నూతన ధరలు ఈ నెల 22 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో పాత ధరల్లో రిజిస్ట్రేషన్లకు ఇంకా ఒక్క రోజే మిగిలి ఉండడంతో భూముల క్రయ విక్రయాల నిమిత్తం జనాలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పోటెత్తారు.
ఇది కూడా చదవండి : ఏపీలో ప్రభుత్వ కార్యాలయల పనివేళల్లో మార్పులు..