Friday, November 22, 2024

తెలంగాణలో నేటి నుంచి పెరగనున్న భూముల ధరలు..

తెలంగాణలో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులు, భూముల విలువలు పెంచుతూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన భూముల ధరలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. అయితే వాటికి అనుగుణంగా రిజిస్ట్రేషన్ రుసుములు పెంచుతూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భూముల విలువను మొత్తం మూడు శ్లాబులుగా విభజించింది ప్రభుత్వం. అయితే రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నేటి నుంచి పెరిగిన విలువలు, చార్జీలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. ఇప్పటికే ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకున్న వారు అదనపు రుసుము చెల్లించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. కొత్త రిజిస్ట్రేషన్ చార్జీలను రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఇందుకు అనుగుణంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ‘కార్డ్’ సాఫ్ట్‌వేర్‌లో అవసరమైన మార్పు చేర్పులు చేశారు.

భూముల విలువ తక్కువగా ఉన్న చోట 50 శాతం, మధ్యస్తంగా ఉన్న ప్రాంతాల్లో 40 శాతం, ఎక్కువగా ఉన్న చోట మాత్రం 30 శాతం ధరలు పెంచింది టీ సర్కార్. రిజిస్ట్రేషన్ ఫీజును కూడా 6 శాతం నుంచి 7.5 శాతానికి పెంచేసిన ప్రభుత్వం. కొత్త ధరలకు అనుగుణంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, ధరణి పోర్టల్‌లో కూడా మార్పులు చేసేశారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుక్ చేసుకున్న వారు కూడా కొత్త చార్జీల ప్రకారమే చెల్లింపులు చేసి… రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలి. ఇప్పటికే స్లాటు బుక్ చేసుకున్న వారు 30,891 మంది ఉన్నారు. వీరంతా అదనపు ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. పెరిగిన చార్జీలకు అనుగుణంగా ‘ధరణి’ పోర్టల్‌లోనూ మార్పులు చేశారు.

ఇది కూడా చదవండి : హుజురాబాద్ ఉపఎన్నిక బరిలో వెయ్యి మంది ఫీల్డ్ అసిస్టెంట్లు..

Advertisement

తాజా వార్తలు

Advertisement