హైదరాబాద్ – సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పేరిట పాదయాత్ర చేస్తున్నారు… ఈ రోజు భట్టి విక్రమార్క పాదయాత్ర 1000 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఈ నేపథ్యంలో గాంధీ భవన్ లో ఏఐసీసీ ఇంఛార్జ్ మానిక్ రావు థాక్రే కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ పటిష్టత కోసం పాదయాత్ర చేస్తున్న భట్టిని అభినందించారు.. అలాగే ఇతర నాయకులు క్షేత్ర స్థాయిలో గట్టిగా పని చేయాలన్నారు. రాబోయేది మన ప్రభుత్వమేనని అంటూ కష్టపడితే అధికారం మనదేనని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఎన్నికల వాతావరణం వచ్చేసిందని ఆయన అన్నారు.
బిఆర్ఎస్ అధినేత , ముఖ్యమంత్రి కేసీఆర్ రోజు ప్రజలకు అబద్ధాలు చెబుతూ ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఆయనకు పేపర్, చానల్స్ ఉండంటంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్టు, ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రోజు ఒక వర్గానికి ఏవో ఇస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారని, ఇవన్నీ పచ్చి అబద్దాలు అని కొట్టిపారేశారు. వాటిని మీరు అవగాహన చేసుకొని వాస్తవాలను జనంలోకి తీస్కొని పోవాలన్నారు. ప్రజలకు అర్థం అయ్యే విదంగా, గట్టిగా వాస్తవాలను ప్రచారం చేయాలని కోరారు. నేతలందరూ నిత్యం జనంలోనే ఉండాలని, వాళ్లకు కేసీఆర్ చెప్తున్న అబద్దాలు వివరించాలన్నారు. మనం అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో కూడా వివరించాలని సూచించారు.