Tuesday, November 26, 2024

అంగ‌రంగ‌వైభ‌వంగా లక్ష్మీనృసింహుల కల్యాణోత్సవం..

భీమ్‌గల్‌, (ప్రభన్యూస్‌): భీమ్‌గల్‌ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీమన్నింబాల క్షేత్రంపై శ్రీ లక్ష్మీ నరసింహుని కార్తిక మాస బ్రహ్మౌత్సవాలు అంగరంగ వైభవముగా కొనసాగుతున్నాయి. కార్తిక మాస బ్రహ్మౌత్సవాలలో భాగంగా శనివారం శ్రీ లక్ష్మీ నరసింహుని కల్యాణ మహౌత్సవాన్ని ఆలయ వంశపారంపర్య ధర్మకర్త నంబిలింబాద్రి కుటుంబీకులు పార్థసారతి, విజయసారథి అర్చక బృందం అద్వర్యంలో అంగరంగ వైభవముగా నిర్వహించారు. అఖిలాండ కోటి బ్రహ్మండనాయకుడైన శ్రీ లక్ష్మీ నరసింహుని కల్యాణ మహౌత్సవాన్ని తిలకించేందుకు వివిద ప్రాంతాల నుండి భక్తులు కొండకు చేరుకున్నారు.

కల్యాణ మహౌత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం గర్భాలయంలో కొలువైన మూలవిరాట్‌ విగ్రహలకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటలకు స్వర్ణాలంకార భూషితులైన శ్రీ లక్ష్మీ నరసింహుని ఉత్సవ విగ్రహన్ని రంగురంగుల పూలతో అలంకరించిన పల్లకిలో బోయలు వెూస్తుండగా మంగళవాయిద్యాలు, డప్పుల చప్పుల్లు, మేళతాళాలు వెూగుతుండగా ముత్తైదువుల మంగళహరతులతో అశ్వవాహనంపై పురవీధుల గుండా ఊరేగించారు. అంజనేయ స్వామి ఆలయం వద్ద స్వామివారి విగ్రహం ఉంచి శ్రీ లక్ష్మీ దేవిని పల్లకిలో స్వామివారి చెంతకు చేర్చారు. మంగళవాయిద్యాలతో స్వామివారి కల్యాణ మహౌత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు.

భీమ్‌గల్‌ సర్వ సమాజ్‌ కమిటీ అధ్యక్షుడు చిన్న పాపారాయుడు అలియాస్‌ గంగారాం అద్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహుని కల్యాణ మహౌత్సవానికి తలంబ్రాలు, పట్టవస్త్రాలను అందజేశారు. డప్పుల చప్పుల్లతో ఊరేగింపుగా సర్వ సమాజ్‌ కమిటీ అద్వర్యంలో తీసుకెల్లి అందించారు.

భీమ్‌ గల్‌ సర్కిల్‌ ఇన్స్‌ పెక్టర్‌ శ్రీనాథ్‌ రెడ్డి, ఎస్సై ప్రభాకర్‌ అద్వర్యంలో కొండపై కల్యాణ మహౌత్సవం సందర్భంగా బందోబస్తు నిర్వహించారు. కొండపైకి కేవలం ద్విచక్ర వాహనాలను మత్రామే అనుమతి ఇచ్చారు. కార్లతో పాటు పెద్ద వాహనాలను అనుమతించలేదు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement