హైదరాబాద్: దీపావళి పండుగను పురస్కరించుకొని జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలోని ట్రెజరీ విభాగంలో లక్ష్మి పూజ నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమంలో హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్, డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ.. దీపావళి పండుగ హిందువులకు ప్రత్యేక మైనదననారు, చెడుపై సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని జరుపుకుంటారన్నారు.
కొన్ని ప్రాంతాల్లో ఈ పండుగను ఐదు రోజుల పాటు జరుపుకుంటారని మేయర్ విజయలక్ష్మి అన్నారు. అశ్యయుజా బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు కార్తీక శుద్ధ విదియ భగినీ హస్త భోజనంతో ముగుస్తాయన్నారు. ఆరోగ్యానికి ఔషధానికి అధిపతి అయిన ధన్వంతరి జయంతి కూడా ఈ రోజు ఆరోగ్యం కోసం అనారోగ్యం నుండి ఉపశమనం కలగడానికి ధన్వంతరి పూజ చేస్తారన్నారు. ఈ రోజు ధనలక్ష్మి పూజ చేస్తే ధన ధాన్యాలు అష్టఐశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి అని ప్రజల నమ్మకం మన్నారు. ఈ సందర్భంగా నగర ప్రజలకు ఆయురారోగ్యాలు, సిరి సంపదలు సుఖసంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు. అంతకుముందు చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి.
కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ జయరాజ్ కెనడి, సరోజ చీఫ్ ఫైనాన్స్ అడ్వజైర్, విజయ కుమార్ చీఫ్ మెడికల్ ఆఫీసర్, పద్మజ, చీఫ్ పిఆర్ఓ ఆఫీస్ పిఅర్ఓ జీవన్ కుమార్, ఫైనాన్స్ విభాగపు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.