లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. పెద్దపల్లి మండలం దేవునిపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతరలో భాగంగా శుక్రవారం స్వామివారి కళ్యాణం వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య కన్నుల పండువగా జరిగింది. కల్యాణోత్సవం సందర్భంగా పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న అనంతరం కళ్యాణ మహోత్సవం లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ లు బండారి స్రవంతి-శ్రీనివాస్, బాలాజీ రావు, మండల పార్టీ అధ్యక్షుడు మార్కు లక్ష్మణ్, సర్పంచ్ రావిశెట్టి కిషన్, ఎంపీటీసీ లు లక్ష్మణ్, తోట శ్రీనివాస్, సర్పంచ్ శారద -శ్రీనివాస్, ఉప సర్పంచ్ స్వప్న, తలారి సాగర్, కనకరాజు, నర్సింగం, రాజేశం, నారాయణ, తిరుపతి, రాజయ్య, నర్సయ్య, చంద్రయ్య, గ్రామ పాలక వర్గం, ఈఓ శంకర్ తో పాటు అధిక సంఖ్యలో భక్తులు, తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..