ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్: లగచర్ల దాడి కేసులో అరెస్టయి, రిమాండ్‌లో ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. హైదరాబాద్ చర్లపల్లి జైల్లో ఉన్న ఆయనను తోటి ఖైదీలతో ఉంచకుండా… ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని జైలు సూపరింటెండెంట్‌ను హైకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా ఇంటి భోజనం తెప్పించుకోవడానికి కూడా కోర్టు అనుమతించింది. మరోవైపు నరేందర్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను వికారాబాద్ కోర్టు వాయిదా వేసింది. రిమాండ్ ఆర్డర్‌ను క్వాష్ చేయాలనే పిటిషన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున… బెయిల్ పిటిషన్ విచారణను వాయిదా వేస్తున్నట్టు వికారాబాద్ కోర్టు తెలిపింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. కాగా, క్యాష్ పిటిషన్ విచారణ హైకోర్టు రేపు చేపట్టనుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement