Sunday, November 10, 2024

CM Revanth | కురుమూర్తి అంటేనే మరో తిరుపతి: సీఎం రేవంత్ ​

  • కొండపైకి రోడ్డు కోసం 110 కోట్లతో పనులు
  • మక్తల్​, నారాయపేట ప్రాజెక్టును ప్రారంభిస్తాం
  • కేసీఆర్​ హయాంలో అన్నీ పెండింగ్​ పనులే
  • ఆ ప్రాజెక్టులన్నీ తప్పకుండా పూర్తి చేస్తం
  • నా సొంత జిల్లా పాలమూరుకు మేలు చేస్తా
  • ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే యువత ఊరుకోదు
  • ఏ దేశం పోయినా సొంత జిల్లాకోసమే తపన
  • సీఎంతో పాటు పాల్గొన్న మంత్రులు వెంకట్​రెడ్డి, దామోదర

ఆంధ్రప్రభ స్మార్ట్​, హైదరాబాద్​: కురుమూర్తి క్షేత్రం అంటే మరో తిరుపతి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా చిన్న చింత‌కుంట అమ్మాపురంలోని కురుమూర్తి వేంకటేశ్వరస్వామిని ఆదివారం దర్శించుకున్న అనంతరం పలు అభి వృద్ధి పనులకు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనర్సింహలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కొండపైకి రోడ్డుకు ₹110కోట్లు కేటాయించినట్టు తెలిపారు. త్వరలోనే మక్తల్-నారాయణపేట ప్రాజెక్ట్ ప్రారంభిస్తామని అన్నారు.

- Advertisement -

ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తాం..

కేసీఆర్ హయాంలోని పదేళ్ల పాలనలో ఏ ప్రాజెక్ట్ పూర్తి కాలేదని సీఎం రేవంత్​ విమర్శించారు. అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి అడుగులు వేస్తున్నాం. కొంత మంది కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. మా జిల్లాలో అభివృద్ధి పనులను ఎవ్వరైనా అడ్డుకోవాలని చూస్తే.. జిల్లా యువత వారిని అడ్డుకుంటారని రేవంత్​ తెలిపారు. కేసీఆర్​ను పాలమూరు ప్రజలే పార్లమెంట్​కు పంపారని గుర్తు చేశారు. పాలమూరుకు మేము నిధుల వరద పారిస్తామని తెలిపారు. నా మీద కోపంతో జిల్లా అభివృద్ధికి అడ్డుపడకండి అని సూచించారు. తాను ఎక్కడికి పోయినా ఏ దేశం పోయినా నా సొంత జిల్లా అభివృద్ది చెందాలని కోరుకుంటున్నానని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement