హైదరాబాద్: బిజెపి నేతలు తలకిందులుగా తపస్సు చేసినా ఆ పార్టీ ఖమ్మంలోనే కాదు తెలంగాణలో ఎక్కడా గెలవలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు భవిష్యవాణి వినిపించారు..హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తొమ్మిదేళ్ల నరేంద్రమోడీ పాలనలో ఏ వర్గానికి ప్రయోజనం కలిగింది? అంటూ ప్రశ్నించారు..అభివృద్ధి కంటే నేతలను కొనుగోలు చేయడమే బిజెపి పనిగా పెట్టుకుందని ఆరోపించారు.. ”ఖమ్మంపై అన్ని పార్టీలు ఫోకస్ పెడుతున్నాయి. ఖమ్మం, నల్గొండ జిల్లాలు కమ్యూనిస్టులకు బలం. కొంతమంది ఏ పార్టీలోకి వెళ్లాలి? ఏం చేయాలి? అనే ధోరణితో ఖమ్మం క్రాస్ రోడ్డులో నిలబడ్డారు. అలాంటి వారిని చేర్చుకునేందుకు కొన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి. కేంద్రహోం మంత్రి అమిత్ షా ఖమ్మంకు పెద్ద పెద్ద వలలు వేసుకుని వస్తున్నారు. తొమ్మిదేళ్లలో తెలంగాణకు ఏం చేశారో ఆయన చెప్పాలి. విభజన హామీల ఊసే అమిత్‌షా ఎత్తడం లేదు. ఖమ్మంకు వచ్చే నైతిక హక్కు ఆయనకు లేదు. ఆయన పర్యటనను మేం వ్యతిరేకిస్తున్నాం అంటూ పేర్కొన్నారు..
కులం, మతం పేరుతో రాజకీయాలు చేసి అధికారంలోకి రావాల్సిన అవసరం తమకు లేదన్నారు. సింగరేణిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు… పోడు భూముల సమస్యలను పరిష్కరించాలంటూ . కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇవ్వాలని రాష్ర్ట ప్రభుత్వాన్ని కోరారు… రైతుల రుణమాఫీని పూర్తి చేయాలన్నారు. ధరణిలో తలెత్తుతున్న సమస్యలపై ఎందుకు అఖిల పక్షం నిర్వహించడం లేదు? అంటూ ధరణి వల్ల లాభనష్టాలు ఉన్నాయి. ప్రభుత్వం భేషజాలకు పోకుండా సమస్యలను పరిష్కరించాలి. లోపాలను సరిదిద్దితే ప్రజలకు మరింత మంచి జరుగుతుంది” అని కూనంనేని అన్నారు.