Monday, November 18, 2024

Rain Affected Areas – జంట‌ న‌గ‌రాల‌లోని వర్ష ప్రభావిత ప్రాంతాలలో కెటిఆర్ పర్యటన ..

హైదరాబాద్ – గత నాలుగు రోజులుగా కురిసిన వర్షాలతో హైదరాబాద్ నగరాన్ని వరద ముంచెత్తుతుంది. మూసి ఉదృతంగా ప్రవహిస్తుంది.. ఈ నేప‌థ్యంలో అంబర్ పెట్ లోని మూసారాం బాగ్ బ్రిడ్జి మూసి పరివాహక ప్రాంతాన్ని మంత్రి కేటీఆర్ ప‌రిశీలించారు.. మూసి ఉధృతి పై చేపడుతున్న సహాయక చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు… గతంలోనే ముసరాంబాగ్ బ్రిడ్జి నిర్మాణానికి 52 కోట్ల నిధులు కేటాయించామని. వర్షాలు తగ్గుముఖం పండిన వెంటనే బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడుతామని మంత్రి తెలిపారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ , మలక్పేట్ ఎమ్మెల్యే బల్లాల మ స్థానిక కార్పొరేటర్ లు పాల్గొన్నారు…

హుస్సేన్‌ సాగర్‌లో వరద పరిస్థితిని ప‌రిశీలించిన కెటిఆర్
హైదరాబాద్‌లోని హుస్సేన్‌ సాగర్‌లో వరద పరిస్థితిని మంత్రి కేటీఆర్ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. వర్షకాలం ప్రారంభానికి ముందే నాలాల్లో పూడిక తీశామని చెప్పారు. చెరువుల్లోనూ తక్కువ నీటిమట్టం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామని వెల్లడించారు. నగరంలో ఎస్సార్‌డీపీ చేపట్టకముందు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యేవని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement