Wednesday, December 25, 2024

KTR’s Twit – దొడ్డు వడ్లకు తెడ్డు ….

హైదరాబాద్‌: ధాన్యం కొనుగోళ్ల విషయంలో కొన్నది కాకరకాయ.. కొసిరింది గుమ్మడికాయ అన్నట్లు కాంగ్రెస్‌ సర్కార్‌ తీరు ఉన్నదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయితే ప్రభుత్వం కొన్నది 46 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమేనని విమర్శించారు. రైతుభరోసా కింద ఎకరాకు ఏడాదికి రూ.15 వేల కోట్లకుగాను గత వానాకాలం, యాసంగి కలిపి ఎగ్గొట్టింది రూ.26 వేల కోట్లని చెప్పారు.


క్వింటాలుకు రూ.500 బోనస్ అని రైతులలో ఆశలు రేపి దొడ్డు వడ్లకు.. తెడ్డు చూపి, సన్న వడ్లకు సవాలక్ష కొర్రీలు పెట్టి విదిలించింది కేవలం రూ.530 కోట్లని మండిపడ్డారు. అసలు రైతుకే భరోసా లేదని, ఇక కౌలు రైతులు, రైతుకూలీల ఊసెక్కడిదని ధ్వజమెత్తారు. కల్లాల వద్దకే కొనుగోళ్లతో కేసీఆర్ ప్రభుత్వంలో రైతుకు భరోసా కల్పించామన్నారు. కల్లోల కాంగ్రెస్ పాలనలో ధాన్యం కొనుగోళ్లు లేక రైతన్నలు నిత్యం ఆందోళనలు చేస్తున్నారని విమర్శించారు. జాగో తెలంగాణ జాగో అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

కోత‌లు, చావులు, బూతులు…. ఇంకేమైనా ఉన్నాయా..

- Advertisement -

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై మ‌రో ట్విట్ లో మండిపడ్డారు కేటీఆర్. అసలు తెలంగాణలో ఏం జరుగుతున్నది అంటూ ప్రశ్నించారు. కూల్చివేతలు, ఎగవేతలు, కరెంటు కోతలు, చిన్నారుల చావులు, కోడెల అమ్మకాలు, అల్లర్లు, అబద్ధాలు, పగలు, ప్రతీకారాలు, దాడులు, దౌర్జన్యాలు, ధర్నాలు, దీక్షలు, ఢిల్లీ టూర్లు, అప్పులు, తప్పులు, డైవర్షన్లు, స్టంట్లు, బూతులు, లూటీలు, కేసులు, అరెస్ట్‌లు.. ఇవేనా? ఇంకేమైనా ఉంటే చెప్పండి అంటూ పోస్టు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement