Sunday, November 3, 2024

KTR’s Twit – దీన్నే దయగల ప్రభుత్వం అంటారు…

కేసీఆర్‌ హ‌యాంలో తెలంగాణ స‌స్య‌శ్యామ‌లం
2015 వ‌ర‌కు రైతుల ఆత్మ‌హ‌త్యలు ఎక్కువ‌
ఆ త‌ర్వాత క్ర‌మేణా త‌గ్గుతూ వ‌చ్చిన ప‌రిస్థితి
ఈ మ‌ధ్య‌కాలంలో రైతుల స్థితిగ‌తుల‌పై ప‌రిశీల‌నాత్మాక‌ గ్రాఫ్‌
వ్య‌వ‌సాయం, సాగునీటికి కేసీఆర్ ప్రాధాన్య‌మిచ్చారు
అందుకే రైతుల జీవ‌న ప్ర‌మాణాలు మెరుగ‌య్యాయి.
ట్విట్ట‌ర్ వేదిక‌గా వివ‌రాలు షేర్ చేసిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్

ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరబాద్ – బీఆర్‌ఎస్‌ హయాంలో తెలంగాణ భూములు సస్యశ్యామలమయ్యాయని, రైతుల జీవితాలు మెరుగుపడ్డాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణలో 2015 నుంచి 2022 వరకు రైతుల ఆత్మహత్యలు ఎలా తగ్గుతూ వచ్చాయో తెలిపే గణాంకాలకు సంబంధించిన ఒక గ్రాఫ్‌ను జూన్‌ 24న అర్వింద్‌ వారియర్‌ అనే ఒక ఎక్స్‌ యూజర్‌ తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశాడు.

- Advertisement -

బీఆర్ ఎస్ హ‌యాంలో రైతుల జీవ‌నం మెరుగు..

దేశంలోని రైతు ఆత్మహత్యల్లో 2015లో తెలంగాణ రైతుల వాటా 11.1 శాతంగా ఉండేదని, ఆ శాతం క్రమం తగ్గుతూ 2022 నాటికి 1.57 శాతానికి చేరిందనే విషయాన్ని ఆ గ్రాఫ్‌ స్పష్టం చేస్తున్నది. ఈ క్రమంలో అర్వింద్‌ వారియర్‌ పోస్టును కోట్‌ చేస్తూ తాజాగా కేటీఆర్‌ తన ఎక్స్‌ అకౌంట్‌లో కొత్త పోస్టు పెట్టారు. బీఆర్‌ఎస్ హయాంలో రైతుల జీవితాలు ఎలా మెరుగుపడ్డాయో వివరించారు.

తీవ్ర క‌రువు ఉన్న ప్రాంతం..

‘2014కు ముందు తెలంగాణ ప్రాంతం దేశంలోని తీవ్ర కరువు కాటకాలు ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో ఒకటిగా ఉండేది. సాగునీటి సౌకర్యం లేక ఎక్కడ చూసినా బీడు భూములే దర్శనమిచ్చేవి. అప్పటి ప్రభుత్వాల నిర్లక్ష్యంవల్ల తెలంగాణలో వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతిన్నది. పెట్టిన పెట్టుబడులు కూడా రాక రైతులు అప్పులపాలై పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్నారు’ అని కేటీఆర్‌ గుర్తుచేశారు.

వ్య‌వ‌సాయం, సాగునీటికి ప్రాధాన్యం..

‘కేసీఆర్‌ ప్రభుత్వం చొరవ తీసుకుని, చిత్తశుద్ధితో తెలంగాణలో వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేసింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషితో క్రమంగా వ్యవసాయ రంగం గాడినపడింది. వ్యవసాయంలో నాణ్యత పెరిగింది. రైతుల జీవితాల్లో వెలుగులు నిండాయి. అందుకు ఈ కింద ఉన్న గణాంకాలే నిదర్శనం’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ పోస్టుకు ‘దీన్నే దయగల్ల ప్రభుత్వం అంటరు’ అనే టైటిల్‌ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement