ఆంధ్ర ప్రభ స్మార్ట్ – హైదరాబాద్: పుట్టినరోజు సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు. గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా మరో మానవీయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
గడిచిన ఏడు నెలల్లో ఆత్మహత్య చేసుకున్న 13 మంది నేత కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు స్టేట్ హోమ్‌లో ఉన్న వందమంది అనాథ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను అందజేశారు .
కాగా, నేటి ఉదయం కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు నందినగర్ నివాసంలో జరుపు కున్నారు. .సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు, కూతురు తో కలిసి కేటీఆర్ తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ , తల్లి శోభమ్మ లకు పాదాభివందనం చేసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఈ సందర్భంగా.. కుమారుడు కేటీఆర్ ను ప్రేమతో గుండెకు హత్తుకున్న కేసీఆర్ , మిఠాయిలు తినిపించి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని మనసారా ఆశీర్వదించారు. కుమారునికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు నంది నగర్ కు వచ్చిన పార్టీ కార్యకర్తలు అభిమానులతో కలిసి కేటీఆర్ ఫొటోలు దిగారు.