Friday, November 22, 2024

TG | ప్రేమోన్మాది బాధిత కుటుంబానికి కేటీఆర్ ఆర్ధిక సాయం…

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో ప్రేమోన్మాది చేతిలో గాయపడిన గిరిజన కుటుంబానికి మాజీ మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. నిందితుడి దాడిలో తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు చిన్నారులకు బీఆర్ఎస్ తరఫున రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. పిల్లలిద్దరికీ దీర్ఘకాలిక చికిత్స అవసరం దృష్ట్యా బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చేలా ప్రభుత్వం రూ.50లక్షల‌ ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

పెదహారుచింతల తండాకు చెందిన దీపిక, గుండెంగ గ్రామానికి చెందిన బన్నీ గతేడాది నవంబర్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. జనవరిలో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించ‌గా… పోలీసులు ఇరువర్గాలకు కౌన్సెలింగ్‌ ఇచ్చి యువతిని తల్లిదండ్రులతో పంపించారు. అప్పటి నుంచి ఆ యువతి ఇంట్లోనే ఉంటూ హన్మకొండలో డిగ్రీ చదువుతోంది.

తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారనే సమాచారంతో ఉన్మాదిగా మారిన బన్నీ.. ఈ నెల 11న ఇంటి ముందు నిద్రిస్తున్న యువతి తల్లిదండ్రులపై దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో దీపిక తల్లిదండ్రులు బానోత్‌ శ్రీనివాస్, సుగుణలు మృతి చెందారు. దాడిలో దీపికతో పాటు ఆమె సోదరుడు మదన్‌లాల్‌కు కూడా గాయాలయ్యాయి. ఈరోజు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి యువతి, ఆమె సోదరుడిని కేటీఆర్ వద్దకు తీసుకెళ్లారు. ఈ సంబ‌ర్భంగా బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తానని, వారి చదువుకు బాధ్యత తీసుకుంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement