Monday, November 18, 2024

TS : ఇవాళ ఢిల్లీకి కేటీఆర్‌, హ‌రీష్‌….

ఇవాళ ఢిల్లీకి కేటీఆర్‌, హ‌రీష్‌రావు వెళ్ల‌నున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. అయితే, ఈడీ ఏడు రోజుల కస్టడీ విధించింది. దీంతో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులు ఢిల్లీ వెళ్లి కవితను కలవనున్నారు.

- Advertisement -

వీరితో పాటు మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, జాన్సన్ నాయక్ హస్తినకు పయనం కానున్నారు. ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య కలిసేందుకు కోర్టు అవకాశం కల్పించింది. ఆ సమయంలోనే భర్త అనిల్, సోదరుడు కేటీఆర్‌తో పాటు హరీష్‌రావు న్యాయవాదులు కవితను కలిసే అవకాశం ఉంది. కాగా కవిత అరెస్టుపై ఆమె తండ్రి మాజీ సీఎం కేసీఆర్ ఇప్పటివరకూ రెస్పాండ్ కాలేదు. దీంతో పొలిటికల్ సర్కిల్‌లో జోరుగా చర్చ జరుగుతోంది.

కాగా, కవితను ఈడీ అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కవితకు మద్దతుగా, ఈడీకి, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేటీఆర్‌, హరీశ్‌ రావు ఈ నిరసనల్లో పాల్గొనలేదు. ఆర్‌ఎస్ ప్రవీణ్‌ కుమార్‌తో కేసీఆర్ నివాసంలో జరిగిన భేటీలో వారు కూడా పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement