సెప్టెంబర్ 2న జరిగే పార్టీ జెండా పండగను ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గ్రామాలు, పట్టణాలలోని వార్డుల్లో పార్టీ జెండాను ఆవిష్కరించాలని సూచించారు. మంగళవారం టీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు పార్టీ సంస్ధగత నిర్మాణంపైన కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. పార్టీ జెండా పండగ కార్యక్రమానికి గ్రామ, వార్డులో పరిధిలో పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరూ వచ్చేలా సమాచారం అందించి సమన్వయం చేసుకోవాలన్నారు.
ఢిల్లీలో పార్టీ కార్యాలయ భవనానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో పార్టీ జెండా పండుగ విజయవంతానికి కృషి చేయాలని కేటీఆర్ కోరారు. పార్టీ నియోజకవర్గ ఇంఛార్జిలు, సీనియర్ నాయకులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. స్థానిక నాయకత్వమే జెండా పండగను విజయవంతం చేయాలన్నారు. సెప్టెంబరు 2 నుంచి 12 వరకు గ్రామ, వార్డు కమిటీల నియామకం జరుగుతుందని కేటీఆర్ వివరించారు. అలాగే 12 నుంచి 20 వరకు మండల, పట్టణ కమిటీల నియామకం.. ఆ తర్వాత జిల్లా కార్యవర్గాల ఎంపిక, జిల్లా అధ్యక్షుల ఎంపిక జరుగుతుందని వివరించారు.
ఇది కూడా చదవండి: అఫ్గాన్ ను వీడిన అమెరికా సైన్యం.. తాలిబన్లకు పూర్తి స్వాతంత్య్రం!