Thursday, November 7, 2024

KTR Twit – కంచె చేనును మేస్తుంటే .. దిక్కెవ‌రు రేవంత్….

దళిత మ‌హిళ‌పై పోలీసులు దాష్టికం
రేవంత్ స‌ర్కార్ పై కెటిఆర్ గ‌రం గ‌రం
ముఖ్య‌మంత్రే దారిలోనే పోలీసులు కూడా
ప్ర‌జాపాల‌న లో ఇంత అమానుష‌మా
ఆడ్డ‌బిడ్డ‌లు ఉసురుత‌ప్ప‌ద‌న్న‌కెటిఆర్

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ – షాద్‌నగర్‌లో దళిత మహిళపై పోలీసుల దాడిని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఖండించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రే స్వయంగా ఆడబిడ్డలను అవమానిస్తుంటే పోలీసులు మాత్రం మేమేమీ తక్కువ అన్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇదేనా ప్రజా పాలన అంటూ ఎక్స్‌ వేధికగా ఫైర్‌ అయ్యారు. ఆడబిడ్డలపై లాఠీఛార్జీలు, దాడులకు తెగబడుతున్నారన్నారు. దొంగతనం ఒప్పుకోవాలంటూ థర్డ్‌ ప్రయోగిస్తారా అంటూ నిలదీశారు. మహిళ అని కూడా చూడకుండా ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తారా అని ప్రశ్నించారు. ఇదేనా ఇందిరమ్మ పాలన..

- Advertisement -

రక్షించాల్సిన పోలీసులతో రక్షణ లేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతున్నదని ప్రశ్నించారు. మహిళలంటే ఇంత చిన్నచూపా.. ఓవైపు అత్యాచారాలు, అవమానాలు.. మరోవైపు దాడులు, దాష్టీకాలంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆడబిడ్డల ఉసురు ఈ ప్రభుత్వానికి మంచిది కాదన్నారు.

వాళ్లను గౌరవించకపోయినా ఫర్వాలేదు. ఇలా దౌర్జన్యాలు మాత్రం చేయకండి. షాద్‌నగర్‌లో దళిత మహిళపై పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత నీచమైనదని, బీఆర్ఎస్ పార్టీ ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తోంది. వెంటనే ఈ దాడికి పాల్పడిన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత మహిళలకు న్యాయం చేయాలని వెల్లడించారు.

ద‌ళిత‌,మ‌హిళా వ్య‌తిరేక ప్ర‌భుత్వం ఇది.

దళిత, మహిళా వ్యతిరేక కాంగ్రెస్ సర్కారును తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదన్నారు. వెంటనే ఈ దాడికి పాల్పడిన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాల‌న్నారు కెటిఆర్ . బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల‌ని,. బాధిత మహిళకు న్యాయం చేయాల‌ని కోరారు.

గొడ్డుకారంతో విద్యార్ధుల‌కు బోజ‌నం

ప్రభుత్వ బడులల్లో పిల్లలకు పౌష్టికాహారం అందించటంలో కాంగ్రెస్ సర్కార్ ఫెయిలైందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా కొత్త‌ప‌ల్లి పాఠ‌శాల‌లో మ‌ధ్యాహ్న భోజ‌నంలో కారం లేని ప‌ప్పు వడ్డించార‌ని… పిల్ల‌లు తినేందుకు ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌డంతో వాళ్లకు గొడ్డు కారం, నూనె పోసి భోజ‌నం పెట్టటం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు ఇలాంటి ఆహారం అందిస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పిల్లలకు మంచి భోజనం పెట్టకపోగా…కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన బ్రేక్ ఫాస్ట్ స్కీంను కూడా రద్దు చేయటమేమిటన్నారు. పిల్లలకు బడులల్లో పెడుతున్న భోజనం నాణ్యత విషయంలో సమీక్షించాలని తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని కేటీఆర్ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement