హైదరాబాద్ – అసెంబ్లీలో టూరిజమ్ పాలసీపై స్వల్పకాలిక చర్చ జరుగనున్న నేపథ్యంలో రెండు అంశాలపై తప్పక చర్చించాలన్నారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అందులో ఒకటి ఢిల్లీ టూరిజం, మరొకటి జైల్ టూరిజం అని చెప్పారు. ఈ రెండు అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎనలేని ప్రగతి సాధించిందన్నారు.
ఢిల్లీ టూరిజంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు వందసార్లకుపైగా దేశ రాజధానికి వెళ్లివచ్చారని చెప్పారు. వారి పర్యటనతో రాష్ట్రానికి రూపాయి ప్రయోజనం కూడా కలగలేదని విమర్శించారు. ఇక జైలు టూరిజంలో భాగంగా 40 మంది కొడంగల్ రైతులను జైలుపాలు చేశారన్నారు. సెలబ్రెటీ నటులను జైలుకు పంపించారని, బెయిల్ వచ్చినా విడుదల చేయలేదని మండిపడ్డారు. సోషల్ మీడియా వారియర్లను కటకటాలు లెక్కపెట్టేలా చేశారన్నారు. ఎల్‌అండ్ టీ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ ను జైల్లో వేస్తామని బెదిరించారని ఆరోపించారు. దీనికి మీరేమంటారంటూ ట్వీట్ చేశారు.