అనుముల తిరుపతి రెడ్డికి స్కూలు పిల్లలతో పరేడ్ స్వాగతం
ఇదేనా మార్పు అంటే అని నెటిజన్ల ప్రశ్నలు
స్వతంత్ర భారత చరిత్రలో ఈ విధానం ఎప్పుడూ చూడలేదు
అనుముల కుటుంబ పాలనపై కేటీఆర్ సెటైర్లు
హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణలో అనుముల కుటుంబ పాలనపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. స్కూల్ పిల్లలను ఎండలో నిలబెట్టి.. ఏ హోదా లేని సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డికి పిల్లల పరేడ్‌తో స్వాగతం పలికించడంపై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. ఇదేనా మార్పు అంటే అని రేవంత్ సర్కార్‌ను ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై కేటీఆర్ శుక్రవారం తీవ్రంగా స్పందించారు.
అనుముల సీఎంలలో ఎవరు కావాలో తేల్చుకోండి..
తెలంగాణలో ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకుంటే.. ఇంకో అర డజన్ మంది ఫ్రీగా వచ్చారు.. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల అదృష్టం అని కేటీఆర్ పేర్కొన్నారు. 1+6 ఆఫర్ సీఎం వ్యవస్థని స్వతంత్ర భారత చరిత్రలో ఎప్పడు చూడలేదెమో అని సెటైర్లు వేశారు. వికారాబాద్ సీఎం తిరుపతి రెడ్డికి ఇవే నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రజా పాలన కాబట్టి ప్రజలకి మీ అనుముల సీఎంలలో ఎవరు కావాలో ఎంచుకునే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను అని రేవంత్ రెడ్డికి కేటీఆర్ సూచన చేశారు. సీఎం ఎంపిక కోసం ఐవీఆర్ఎస్ పద్ధతి పెడితే బాగుంటుందేమో చూడండి అని రేవంత్ రెడ్డికి చిన్న విన్నపం చేస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.