నువ్వు తిరుగుతున్న ప్రాంత ఎక్కడ
మోకాలికి దెబ్బ తగిలితే బొడిగుండుకు కట్లా
నీ మూసి దాహానికి అత్తపూర్ ఆగం
గోల్నాకలో గొల్లు. దిల్ షుక్ నగర్ డీలా
తేలు మంత్రి రానోడు పాము మంత్రం వేసినట్లు
ఇక్కడ ఆక్రందనలు వినిపిస్తుంటే అక్కడ నీ సంబరాలా
రేవంత్ మూసి పాదయాత్రపై కెటిఆర్ రుసరుసలు
హైదరాబాద్: మోకాలికి దెబ్బ తగిలితే బోడి గుండుకు కుట్లు వేసినట్టు గుంపు మేస్త్రీ పాలన తీరు ఉందని విమర్శించారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్.. నల్గొండ జిల్లాలోని మూసి నదీ పరివాహక ప్రాంతంలో రేవంత్ పాదయాత్ర చేస్తున్న సందర్భంగా కెటిఆర్ ట్విట్ చేశారు. హైదరాబాద్లో మూసీ బాధితులు ఉంటే.. నల్లగొండలో మూసీ పరివాహక ప్రాంత రైతులను కలవడంలో రేవంత్ రెడ్డి ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కూల్చిన ఇండ్లెక్కడ, కాలిన కడుపులెక్కడ, నువ్ తిరుగుతున్న ప్రాంతం ఎక్కడ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంబరాలు రాంబాబు.. ఆక్రందనలు ఇక్కడ ..
నీ మూసీ దాహానికి అత్తాపూర్ ఆగమైందని, గోల్నాక గొల్లుమంటుందని, దిలుషుక్ నగర్ ఢీలా పడిందన్నారు. నీ కుట్రలకు అంబర్ పేట్, అత్తాపూర్ అతలాకుతలం అవుతుంటే.. నీ పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నది ఎక్కడని ప్రశ్నించారు. అయ్యా సంబరాల రాంబాబు.. నీ అన్యాయానికి ఆవేదనలు, ఆవేశాలు, ఆక్రందనలు వినిపిస్తున్నవి, కనిపిస్తున్నవి అక్కడ కాదు.. రా ఇటు వైపు రా ఇక్కడ చెయ్యి నీ పాదాల మీద యాత్ర అంటూ ఎక్స్ వేదికగా రేవంత్ ను ఆహ్వానించారు.
తేలు మత్రం రానోడు పాము మంత్రం వేసినట్లు ..
తేలు మంత్రం రానోడు పాము కాటుకు మంత్రం ఏసినట్లు.. పాలన తెల్వని నీకు పగ్గాలు అప్పగిస్తే ప్రజల బతుకుల్ల మన్ను పోసినవ్ అంటూ మండిపడ్డారు. నాయకత్వం అంటే కూల్చడం కాదు.. నిర్మించడం నాయకత్వం అంటే తొవ్వ తప్పడం కాదు.. తొవ్వ చూపడం’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.